Begin typing your search above and press return to search.
పవన్ ట్వీట్లకు దిగొచ్చి ట్విటర్ తన నిర్ణయం మార్చుకుంటుందా?
By: Tupaki Desk | 18 Sep 2019 12:31 PM GMTజనసేన పార్టీకి చెందిన 400 ట్విటర్ ఖాతాలు రద్దు కావడంతో ఆ పార్టీ గిలగిలలాడుతోంది. నల్లమల యురేనియంపై పోరాడుతున్నందుకు రాజకీయ కుట్రతో ట్విటర్ ఖాతాలపై రిపోర్టు చేశారని.. ఆ ఫలితంగానే అవన్నీ రద్దయ్యాయని జనసేన అధినేత పవన్ కూడా మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగానే పవన్ ఈ విషయాన్ని రెయిజ్ చేశారు.. అయితే, పవన్ ట్విట్లకు ట్విటర్ ఏమాత్రం స్పందిస్తున్నది చూడాలి. సోషల్ మీడియా రంగంలో పనిచేసినవారు మాత్రం ట్విటర్ అలాంటివాటికి స్పందించదని.. ట్విటర్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వ్యవహరిస్తుందని.. టెక్నికల్‌గా అందుకు విరుద్ధంగా ఉంటే తొలగించేస్తుందని చెబుతున్నారు.
నిజానికి పవన్ ఫాలోయింగ్‌తో పోల్చితే 400 ఖాతాలన్నవి చిన్న నంబరే. కానీ, ఈ 400 ఖాతాల్లో కొన్ని లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న జనసేన విభాగాల అఫీషియల్ అకౌంట్లు. దీంతో ఇది జనసేనకు భారీ నష్టమేనని చెప్పాలి.
ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని కొద్దిరోజులుగా జోరు పెంచింది. రెండు రాష్ట్రాల్లోని ఇష్యూస్ పట్టుకుని ప్రభుత్వాలు - సీఎంలపై పెద్ద ఎత్తున మండిపడుతోంది. ఈ క్రమంలో ఒకే తరహా సందేశాలు పదేపదే పోస్టు చేయడం వంటి చర్యలు ఆ ఖాతాలను దెబ్బతీశాయి. వాటిని రిపోర్టు చేసినవారు స్పామ్ - అబ్యూస్ వంటి కేటగిరీల్లో కంప్లయింట్లు ఇవ్వడంతో ట్విటర్ రివ్యూ చేసి వాటిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్ల కిందట కూడా పవన్‌కు ట్విటర్ కష్టాలు ఎదురయ్యాయి. అయితే, అప్పుడు ట్విటర్ వైపు నుంచి కాకుండా పవన్ వైపు నుంచే సమస్య ఏర్పడింది. 2017 మేలో పవన్ ట్విటర్ ఖాతా లాకయిపోయింది. తొలుత హ్యాకయిందన్న వార్తలు వచ్చిన ఆ తరువాత అది హ్యాకింగ్ కాదని.. వేరే సమస్యని తేలింది. పవన్ ట్విటర్ ఖాతా చూసే ఉద్యోగిని తొలగించడంతో ఆయన వద్ద లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఉండిపోయాయి. దీంతో పవన్ అండ్ టీంకు ఆ అకౌంట్ యాక్సిస్ పోయింది. 18 లక్షల మంది ఫాలోవర్లతో ఆ ఖాతా అప్పట్లో సస్పెండైంది.