Begin typing your search above and press return to search.
తెలుగోళ్లకు కావాల్సింది వీడేనా?
By: Tupaki Desk | 6 July 2015 4:59 PM GMTసగటు మనిషి ఏం కోరుకుంటాడు? సల్లగా.. సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రశాంతంగా ఉండాలని భావిస్తాడు. ఆత్మాభిమానంతో జీవిస్తే చాలనుకుంటాడు. తాను.. తనతో పాటు ఉన్న సమాజంగా పచ్చగా ఉండే బాగుండదనుకుంటాడు. అంతేకాదు.. ఒకడు నాశనం అయిపోవాలని.. ఆవేశంతో తిట్టేసుకుంటూ.. కోపంతోకొట్టేసుకుంటూ.. అభివృద్ధికి దూరంగా.. ఆటవికంగా ఉండాలనుకోడు.
వీటితో పాటు.. తమను పాలించే వారికి.. ప్రజల పట్ల అభిమానం ఉండాలని.. తమకేదైనా చేయాలని అనుకుంటారు. మారిన రాజకీయాల్లో.. విలువలు తగ్గిన వేళ.. ఇలాంటివి ఆశించటం కష్టమే. తమ స్వార్థం కోసం డిమాండ్లను పుట్టించటం.. తమ ఉనికి కోసం ఆందోళనలు సృష్టించటం.. తమ అధికారం కోసం మంట పుట్టించటమే కాదు.. ఏదైనా సరే.. ఎంతకైనా సరే.. అన్నట్లుగా వ్యవహరించటం ఇప్పటి రాజకీయ నేతలకు అలవాటు.
ఒకరినొకరు గౌరవించుకుంటూ.. ప్రజల సంక్షేమం కోసం.. ఆరోగ్యకరమైన పోటీ నడపాలన్న ఆలోచన అస్సలు ఉన్నట్లే కనిపించరు. రెచ్చగొట్టేవాడి మాటలకు రెచ్చిపోయి.. బాధ్యతల్ని విడిచిపెట్టి.. భావోద్వేగంతో ఊగిపోతూ.. ఎవరి కోసం ఈ బీపీ అన్న విషయాల్ని పట్టించుకోకుండా ఉండిపోతున్న వేళ.. తెలుగు వారికి ఎలాంటి నాయకుడు కావాలన్న విషయాన్ని తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన మాటల ద్వారా చెప్పేశాడు.
ఆయన తాజాగా మాట్లాడిన మీడియా సమావేశం చూసినప్పుడు.. సమాజ క్షేమం కాంక్షించే వారంతా అనుకునేది ఒక్కటే.. ఇలాంటోడు తెలుగు వారికి సారథ్యం వహిస్తే.. వారి బతుకులు మారటంతో పాటు.. చిల్లర రాజకీయాలకు చెల్లుచీటి పడే అవకాశం ఉందని. కులంతో.. మతంతో.. ప్రాంతం లాంటి భావోద్వేగాల్ని ఒళ్లంతా అలుముకున్న వారికి పవన్ బాధ్యత మాటలు అర్థం అవుతాయా?