Begin typing your search above and press return to search.
హైటెక్ సిటీని రిపీట్ చేస్తున్నావు..బాబు రోడ్లపై తిరగనీయం
By: Tupaki Desk | 2 Jun 2018 4:50 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీఅధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఎదురుదాడిని మరింత పెంచారు. బాబు గురించిన అనేక కొత్త విషయాలను వల్లడిస్తూ ఆయన కలకలం సృష్టంచే కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా కొత్త హెచ్చరికలను సైతం పవన్ చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు తరచూ జపించే హైటెక్ సిటీ మంత్రంపై విరుచుకుపడ్డారు. ``హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నేనే కట్టాను అని ముఖ్యమంత్రి తరచూ చెప్పుకొంటారు. అక్కడ ఆ భవనం కట్టే ముందు తన అనుయాయులతో చుట్టూ ఉన్న భూముల్ని అతి చౌకగా కొనిపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు. ఇప్పుడు అదే విధానం భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతంలోనూ చేస్తున్నారు`` అని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు తెలంగాణ రైతులు ఎంత బాధపడ్డారో ఇప్పుడు విజయనగరం జిల్లా రైతులు అంతే బాధపడుతున్నారని చెప్పారు. ఎయిర్ పోర్టు పేరు చెప్పి వేల ఎకరాలు సేకరిస్తూ చిన్నచిన్న కమతాలున్న రైతుల్ని రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు భూసేకరణ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై పవన్ సూటిగా స్పష్టం చేశారు. ``అంతర్జాతీయ ఎయిర్ పోర్టు పేరుతో 15 వేల ఎకరాలు తీసుకోవాలి అనుకొన్నారు. తరవాత 5 వేలకి తగ్గారు. 2,500 ఎకరాలు తీసుకొని మిగిలిన భూమిని ఫ్రీజ్ చేయడంతో పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెళ్ళిళ్ళకో - కష్టాలకో పనికొస్తుంది అనుకొనే భూమి ఇలాగైపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా ఎస్ ఈజెడ్ పేరుతో ఇలాగే వేల ఎకరాలు తీసుకొని కొందరికి కట్టబెట్టారు. వాటిలో 5 శాతం కూడా పరిశ్రమలకి వాడటం లేదు. అసలు విమానాశ్రయానికి ఎన్ని ఎకరాలు కావాలో మేం తెలుస్తాం. భోగాపురం చుట్టూ భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుగు దేశం వాళ్ళు ఎలా దోచేస్తున్నారో జాబితా బయటకి తీస్తాం. తెలుగు దేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో నిధులు... నీళ్ళు.. నియామకాల విషయంలో చేసిన అన్యాయం వల్లే తెలంగాణ వాదం వచ్చి రాష్ట్రం విడిపోయింది. అప్పుడు చంద్రబాబు 2020 విజన్ అంటే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వెనకబడ్డ ప్రాంతాల్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టు పక్కలే అభివృద్ధి అంటున్నారు. పైగా విజన్ 2050 అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏమవుతుందో? ఆయన అనే విజన్ 2050నాటికి రాష్ట్రంలో ఎక్కడా ఇసుక - నదులు ఉండవు. ఎందుకంటే టీడీపీ వాళ్లు ఇసుక దోచేసి - నదీ గర్భాల్ని చీల్చేస్తున్నారు`` అని మండిపడ్డారు.
సచివాలయంలో కూర్చొని 17 వేల కిలో మీటర్ల రోడ్లు వేశాం అంటు మాటలు చెప్పడం కాదు..భోగాపురం వచ్చి చూడండి... రాళ్ళు తేలిన - గుంతలతో కూడిన రోడ్లు కనిపిస్తాయి అని పవన్ అన్నారు.``రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నట్లు లేదు. అదేదో ఈవెంట్ మేనేజ్ మెంట్ వ్యవహారంలా వుంది. ఆ మధ్య పుష్కరాలు అన్నారు. ఇప్పుడు నవ నిర్మాణ దీక్షలు అంటున్నారు. వీటికి రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏమిటీ ఈవెంట్లు? ఈ డబ్బులతో భోగాపురం చుట్టుపక్కల మత్స్యకారులకి జెట్టీలు కట్టవచ్చు... తుఫాన్ షెల్టర్లు కట్టొచ్చు. ఈ తీరంలో ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు కట్టిన తుఫాన్ షెల్టర్లే గతి. వేసవిలో చేపల వేటకి వెళ్లలేని మత్స్యకారులకి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. ఈ చుట్టూ పక్కల ఆక్వా కాలుష్యంతో ప్రజలకి రోగాలు వస్తున్నాయి. . వీళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే తెలుగు దేశం ఎమ్మేల్యేలు అభివృద్ధి సాధించటం అనుకొంటా? ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం పంటలు లేక, ఉపాధి లేక వలసలు పోవాల్సిందే. కనీసం తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వడం లేదు. తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిచేయలేదు. అది పూర్తయితే విజయనగరం పట్టణంతోపాటు నెల్లిమర్ల ప్రాంతానికీ నీళ్ళు వస్తాయి. ప్రభుత్వానికి అది పట్టదు. తెలంగాణలో పని చేస్తున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలకి వచ్చేస్తాం అని కోరుతున్నా ఏ ఒక్క ఉత్తరాంధ్ర నాయకుడు పట్టించుకోవడం లేదు. ఈ నాయకులు ఎక్కడికీ వలసపోరు.... జనమే పోవాలి. ఈ నాయకులకి మాత్రం తెలంగాణలో కేబుల్ వ్యాపారాలు… రకరకాల వ్యాపారాలు ఉంటాయి.`` అంటూ మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంపై పవన్ మండిపడ్డారు. ``నేను స్వతంత్ర ఆలోచన - వ్యక్తిత్వం ఉన్నవాడిని. నాకు ఎవరి స్క్రిప్ట్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రకాల బీజేపీ ఉంది. ఒకటి టీడీపీ బీజేపీ - రెండు వైసీపీ బీజేపీ. మూడోది జాతీయ బీజేపీ. జనసేనకి ఎవరి స్క్రిప్ట్ లేదు. ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్ష చేస్తూ పవన కల్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చకొడుతున్నారు అని అంటున్నారు. నేను రెచ్చగొట్టే తత్వం ఉన్నవాడినా. ముఖ్యమంత్రిగారూ ఒకటే చెబుతున్నా... మీ ప్రభుత్వం దోపిడీలు ఇలాగే కొనసాగిస్తే రోడ్డు మీద కూడా తిరగనీయం. అప్పుడు రెచ్చగొట్టడం అంటే ఏమిటో చూపిస్తాను. మీ పాలనతో రైతాంగాన్ని ధ్వంసం చేసేశారు. రైతు అనేవాడిని రోడ్డున పడేసి... కొందరి చేతుల్లోకే భూమిని ఉంచారు. కార్మికులకి ఉపాధి కరవైంది. మూతపడ్డ జూట్ మిల్లులను తెరిపించలేరు. కార్మికులకి రావాల్సిన బకాయిలు ఇప్పించలేరు. నిరసన తెలిపి అడిగితే పోలీసు కాల్పులు జరిపించి అయిదుగురు కార్మికుల్ని పొట్టన పెట్టుకున్నారు. చదువుకున్న యువత వలసలు పోవాల్సి వస్తోంది. ఇలాగే దోపిడి అవినీతి పాలన సాగిస్తే జనసేన మౌనంగా ఉండదు. నిలదీసి ప్రశ్నిస్తుంది. రెచ్చగొట్టడం అంటే ఏమిటో అప్పుడు చూపిస్తుంది.దోపిడీ ఇలాగే సాగిస్తే రోడ్లు మీద కూడా తిరగనీయం`` అని పవన్ స్పష్టం చేశారు.