Begin typing your search above and press return to search.
ఎవరిని వదలకుండా అందరిని ఏసుకుంటున్న పవన్!
By: Tupaki Desk | 23 March 2019 4:55 AM GMTఎవరిని వదలట్లేదు. అందరిని తిట్టేస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఎటకారం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. మోడీ మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మరీ తిట్టేస్తున్న జనసేన అధినేత పవన్ తీరు ఇప్పు్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా ఆయన పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు.. వాడుతున్న భాష.. తెర మీదకు తెస్తున్న అంశాల్ని చూస్తే.. పవన్ కొత్త తరహా వ్యూహాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా కనిపిస్తోంది. పవన్ వెనుక మోడీ ఉన్నారని.. ఆయన కేసీఆర్ కు రహస్య స్నేహితుడని.. అంతకు మించి బాబుతో తెర వెనుక ఒప్పందం చేసుకున్నట్లుగా చాలానే విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. ఏ వర్గానికి ఆ వర్గం.. తమకు తోచినట్లుగా పవన్ మీద పంచ్ లు వేస్తున్న వేళ.. అందరి మీదా టోకుగా విరుచుకుపడే ధోరణిని షురూ చేశారు.
తాజాగా ఆయన పాల్గొన్న సభల్లో మాట్లాడిన మాటల్లో కీలకమైన వ్యాఖ్యల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. తనకు ఎవరూ దగ్గర వారు కాదని.. అందరూ అందరేనన్న భావన కలిగేలా పవన్ మాటలు ఉన్నాయి. ఏపీ గురించి తానుఆలోచించినట్లుగా ఆలోచించే వారు లేరన్నట్లుగా పవన్ తాజా మాటలు ఉన్నాయి. తనకు అందరూ సమాన దూరమన్న విషయాన్ని చెబుతూనే.. మిగిలిన వారికి లింకులు ఉన్నాయని.. తనకు మాత్రం అస్సలు లేవన్న భావన కలిగేలా పవన్ తన ప్రసంగాన్ని వినిపించటం గమనార్హం.
ప్రధాని మోడీని ఉద్దేశించి పవన్ చేసిన విమర్శలు చూస్తే..
+ ప్రధాని మోదీ అంటే మన పార్లమెంటు సభ్యులకు భయం. పార్లమెంటులో సమస్యల గురించి అడుగుతారని.. మోదీ వెనక్కి చూస్తే వైకాపా ఎంపీలు బల్లల చాటున కిందకు కూర్చుండిపోతారు. తెదేపా ఎంపీలు ముఖం కనబడకుండా దాచుకుంటారు’’
+ దమ్ము - ధైర్యం - తెగింపు ఉండి సాహసం చేయగలిగిన నాయకులను జనసేన తరపున బరిలోకి దింపా. ఓట్లు వేయించుకుని పార్లమెంటు హాల్లో పడుకునే వారిని కాకుండా పోరాటం చేసేవారిని రంగంలోకి దించాం.
కేసీఆర్ ను ఉద్దేశించి పవన్ చేసిన విమర్శలు చూస్తే..
+ టీఆర్ ఎస్ వాళ్లు ఆంధ్రా ప్రజలను ద్రోహులని తిట్టారు - రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులను రాళ్లతో తరిమికొట్టారు. కేటీఆర్ ఆంధ్రావాళ్లను పెద్దపెద్ద తిట్లు తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా? గోదావరి రక్తం మీలో ప్రవహించడం లేదా? అటువంటి వారిని ఇక్కడకు ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉంది. ఇదే విషయంపై తాను పోరాటం చేస్తే దాడికి యత్నించారు. అయినా నేను వెనకాడలేదు. ధైర్యమే నా నైజం.
+ తెలంగాణలో ఆంధ్రులు ప్రచారం చేస్తే అంగీకరించని తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? తెరాస సత్తాచాటాలనుకుంటే మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ నిలిపి ప్రచారం చేయండి
+ గత ఎన్నికల్లో పవన్ ఎక్కడున్నారంటూ వెతికిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో పాల్గొనడం మంచిది కాదు.
చంద్రబాబును ఉద్దేశించి..
+ 2019 ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థ మారకపోతే చాలా కష్టం. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ మెంట్ ఉన్నట్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా త్వరలోనే రిటైర్ మెంట్ ఇవ్వాల్సిందే.
+ జగన్ నూ - నన్నూ ఒకేగాటన కడతారా? జగన్ చేసే అక్రమాలు మీ ఎమ్మెల్యేలూ చేస్తున్నారు. దళితులపై దుర్భాషలాడతారు. ఆడపడుచులపై దాడులు చేస్తారు. దౌర్జన్యాలకు దిగుతారు. ఇవన్నీ చేసే చింతమనేనికి మీరెందుకు టిక్కెట్టు ఇచ్చారు. ఈ రౌడీ ఎమ్మెల్యేలకు జాతీయజెండా పట్టుకునే అర్హత ఉందా?
జగన్ మోహన్ రెడ్డి అండ్ కో పై..
+ ఇంట్లో హత్య జరిగితే గుర్తించలేని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు.‘కిరాతకంగా చంపేశారు, వేలిముద్రలు దొరకలేదు - రక్తపు మరకలు లేవు - కొన్ని గంటల తర్వాత లెటరు దొరికింది..ఇలా చెబుతున్నారు.. పినతండ్రి బాధ్యత మీది కాదా..మీ ఇంట్లో జరిగే హత్యకే ఏం మాట్లాడకపోతే భీమవరంలో అలాంటి సంఘటనలు జరిగితే మీరేం అడ్డుకుంటారు.
+ ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఏం న్యాయం చేస్తారు? జగన్ పార్టీ కిరాయి మూకలను ఆంధ్ర ప్రాంతానికి పంపితే తన్ని తరిమేస్తా. మినీ ఇండియా లాంటి భీమవరంలో విజయం సాధించి అభివృద్ధితో విశ్వవ్యాప్తం చేస్తా.
+ తను పోటీలో ఉన్న విషయం మరిచిపోయి జగన్ పార్టీ అభ్యర్థి నిత్యం టీఆర్ఎస్ నేతలతో బిజీగా ఉంటున్నారు. బ్యాంకుల్లో నగదు దాచుకుని కుటుంబ అవసరాలకు, పిల్లల వివాహ, చదువులకు ఉపయోగించుకుందామనుకుంటే అతని మనుషులు అర్బన్ బ్యాంకును దివాళా తీయించారు.పదివేల కుటుంబాల ఉసురు మూటగట్టుకున్నారు. అలాంటి వ్యక్తి తక్షణం ఎన్నికల నుంచి విరమించుకోవాలి.
బాబు - జగన్ ను ఉద్దేశించి ఉమ్మడిగా చేసిన విమర్శలు చూస్తే..
+ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనుకుంటున్నారా? ఇదేమైనా గూండా రాజ్యమనుకుంటున్నారా? కిరాయి రౌడీలతో దాడులు చేస్తారా? ఈ స్థాయిలో దౌర్జన్యాలు జరిగితే సామాన్యుడు ఎలా బతకగలుగుతాడు? ఇన్ని జరుగుతున్నా పట్టించుకోలేందంటే మీరూ.. జగన్ ఒకటే.