Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే అన్న రాంబాబు పతనానికి నాంది: పవన్ కళ్యాణ్
By: Tupaki Desk | 23 Jan 2021 8:20 AM GMTవైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు , వైసీపీ నేతల ఒత్తిడికి ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించాడు. ఒంగోలుకు వచ్చిన పవన్ వెంగయ్య కుటుంబానికి 8 లక్షల 50వేల ఆర్థిక సాయం చేశారు. అతడి పిల్లల చదవుల బాధ్యత తనదేనన్నారు.
ఈ సందర్భంగా కుటుంబాన్ని జనసేన కార్యాలయానికి తీసుకొచ్చి వారిని మీడియాకు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు సోదరుడి బెదిరింపుల వల్లనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఊరికి రోడ్డు కావాలని ప్రశ్నించినందుకు వెంగయ్యను బలి తీసుకున్నారని పవన్ విమర్శించారు. ఇది వైసీపీ పతనానికి నాంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని స్పష్టం చేశారు.
పార్టీ శ్రేణులతో సమావేశం ముగిసిన తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసి పవన్ వినతిపత్రం సమర్పించారు. వెంగయ్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డిసెంబర్ 16న కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిపై జనసేన నేత వెంగయ్య ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగాడు. వైసీపీ నేతలు ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తిట్లకు జనసేన కార్యకర్త ఎమ్మెల్యేకు దండం పెట్టి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన వెంగయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి.