Begin typing your search above and press return to search.

తెనాలిలో జగన్ పార్టీ నేతలు అలా చేశారా?

By:  Tupaki Desk   |   7 April 2019 7:30 AM GMT
తెనాలిలో జగన్ పార్టీ నేతలు అలా చేశారా?
X
ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన పార్టీ అధినేతలకు సంబంధించి ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఏపీ ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న ప్రధాన పార్టీ అధినేతలుగా చంద్రబాబు.. జగన్.. పవన్ నిలుస్తారు. పోరు బాబు.. జగన్ ల మధ్యనే అని చెప్పినా.. వీరిద్దరి గెలుపును డిసైడ్ చేసేది పవన్ మాత్రమేనన్న మాట అందరి నోట వినిపిస్తుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురు అధినేతల ప్రచారాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. బాబు.. జగన్ లకు భిన్నంగా పవన్ కల్యాణ్ ప్రచారం సాగుతుందని చెప్పాలి. తాను వెళ్లిన ప్రతిచోట.. స్థానిక అంశాలు.. తన రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన బలహీనతలు కానీ.. తప్పులు కానీ.. వారు చేస్తున్న ఆరాచకాలను అదే పనిగా ప్రస్తావించటం కనిపిస్తుంది. పవన్ చెప్పినంత ఎఫెక్టివ్ గా మరే అధినేత చెప్పటం లేదు.

తాజాగా తెనాలిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన పవన్ షాకింగ్ విషయాన్ని తెలిపారు. ఇటీవల తెనాలిలో జగన్ పార్టీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా.. స్థానికంగా ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మద్యం సీసాలు పడేసి వెళ్లిపోయారని.. దైవభక్తి లేని వారు సమాజాన్ని ఏం ఉద్దరిస్తారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ ప్రస్తావించిన విషయం ఇప్పటివరకూ మీడియాలో వచ్చింది లేదు.

స్థానికంగా జరిగిన ఉదంతాన్ని పవన్ ప్రస్తావించటం ద్వారా.. అక్కడ సెంటిమెంట్ ను రగల్చటంతో పాటు.. రాష్ట్రంల మొత్తానికి తెలిసేలా చేశారని చెబుతున్నారు. జగన్ ధనదాహానికి ఎంతోమంది ఐఏఎస్ లు జైలుపాలయ్యారని.. ఇలాంటి చరిత్ర ఉన్న నేత అధికారంలోకి రావటం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఏపీ ప్రజలకు ఆదర్శం కాలేరన్నారు. ఇలాంటి వారికి అధికారం అప్పగిస్తే ప్రజలకు న్యాయం జరగకపోగా.. ఆరాచకం పెరుగుతుందంటూ మండిపడ్డారు.

జగన్ మాట్లాడితే.. తన ఫోటో అందరి ఇళ్లల్లో 30 ఏళ్లు పెట్టుకోవాలని అంటారని.. అయినా.. ఇదేం ఆలోచన అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇళ్లల్లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటారు. రాజుల పాలన సాగే దుబాయ్ లాంటి ముస్లిం దేశాల్లో రాజుగారి ఫోటోను తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. జగన్ కూడా తనను తాను అలా అనుకుంటున్నారా? అన్న సందేహం కలిగేలా పవన్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.