Begin typing your search above and press return to search.

32/9.. పవన్ బరిలో నిలిచే తొలి జాబితా

By:  Tupaki Desk   |   11 March 2019 10:30 AM GMT
32/9.. పవన్ బరిలో నిలిచే తొలి జాబితా
X
దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఏపీలో తొలివిడతలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిపోతోంది. నెలరోజుల గడువు ఉండడంతో ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజిబిజిగా ఉన్నాయి.

తాజాగా టీడీపీ తొలి జాబితాను ఖరారు చేసి అందరికంటే ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీ కూడా దాదాపు కొలిక్కి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో మూడో ప్రధాన పార్టీ అయిన జనసేన తాజాగా అభ్యర్థులు, పోటీపై స్పష్టతనిచ్చింది.

పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ ద్వారా జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 32అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ పవన్ ట్వీట్ చేశారు. జనసేన జనరల్ బాడీ ఈ మేరకు అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిపారు. తొలిజాబితా ఓకే అయ్యిందని.. మలి జాబితా ఉంటుందని పవన్ ట్వీట్ ద్వారా అర్థమైంది.