Begin typing your search above and press return to search.
జనసేన టికెట్ల క్లియరెన్స్ సేల్ - వాళ్లకు నాలుగు!
By: Tupaki Desk | 26 March 2019 6:29 AM GMTతను కుటుంబ - వారసత్వ రాజకీయాలకు విరుద్ధం..అని అంటాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అలాగే తను ఫిరాయింపు రాజకీయాలకు కూడా వ్యతిరేకం అని ఇది వరకే ఆయన సెలవిచ్చారు. ఇలాంటి నీతులు అయితే గట్టిగానే చెప్పారు కానీ.. ఆచరణలో మాత్రం పవన్ కల్యాణ్ తీరు మరోలా ఉంది.
తన పార్టీలో ఫిరాయింపుదారులకు స్థానం లేదని చెప్పిన పవన్.. కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని ఇటీవలే చేర్చుకున్నారు. దగ్గరుండి కండువా వేశారు.ఎస్పీవై ఐదేళ్ల చరిత్ర ఏమిటో చెప్పనక్కర్లేదు.
నంద్యాల నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎస్పీవై రెడ్డి.. వెనువెంటనే ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు ఫిరాయింపు నేతగా - ఎంపీగా చలామణి అయిపోయారు. ఇలాంటి ఫిరాయింపులు చేస్తే అనర్హత వేటు పడాలి. అయితే.. ఎస్పీవై ఐదేళ్ల పాటు ఎంపీగా చలామణి అయిపోయారు.
ఇక కనీసం ఆ పార్టీలో అయినా ఉన్నారా..అంటే, తనకు టికెట్ దక్కలేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. అలాంటి వ్యక్తిని దగ్గరుండి పార్టీలోకి చేర్చుకున్నారు జనసేన అధిపతి.
ఆ సంగతలా ఉంటే.. జనసేనలో ఎస్పీవై రెడ్డి కుటుంబానికి ఏకంగా నాలుగు టికెట్లు దక్కడం అంతకన్నా విడ్డూరంగా ఉంది. నంద్యాల ఎంపీగా ఎస్పీవై పోటీ చేస్తూ ఉన్నారు. ఇక నంద్యా ఎమ్మెల్యేగా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ కు టికెట్ ను ఖరారు చేశారు. ఆ పై ఎస్పీవై పెద్ద కూతురుకు ఒక టికెట్టు - ఆయన చిన్నకూతురుకు మరో టికెట్ ఇచ్చారు. ఇలా శ్రీశైలం - బనగానపల్లె ఎమ్మెల్యే టికెట్లు కూడా వారికే దక్కాయి!
ఇదీ కథ. ఒక ఎంపీ సీటు పరిధిలో ఏకంగా నాలుగు టికెట్లు ఒకే కుటుంబానికి దక్కాయంటే - అది కూడా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాకా జనసేనలోకి చేరిన వారికి ఇలా నాలుగు టికెట్లు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదేదో క్లియరెన్స్ సేల్ వ్యవహారంలా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ జనసేన టికెట్ల కోసం పరీక్షలు రాసి - ఇంటర్వ్యూలు చేయించుకున్నవారు ఎక్కడికిపోయారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి!