సినీ నటుడు - జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గొంతు నొప్పి..తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు సమాచారం. పవన్‌ను పరిక్షీంచిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చికిత్స అందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే డిసెంబర్ 14వ తేదీన అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఈ పర్యటన వాయిదా పడుతుందా ? అనేది తెలియరాలేదు.
ఇదిలాఉండగా, గత కొన్ని రోజులుగా ప్రజా పోరాట యాత్ర పేరిట ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించిన పవన్..డిసెంబర్ 14వ తేదీన అమెరికాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గతంలో కూడా పవన్..అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన ఎన్ ఆర్ ఐ జనసేన నేతలతో సమావేశం కానున్న జనసేనానీ...డిసెంబర్ 15వ తేదీన డల్లాస్ లో ప్రవాస గర్జన్ పేరిట నిర్వహించే కవాతులో పాల్గొననున్నారు. అదే రోజు నిర్వహించే బహిరంగసభలో పవన్ ప్రసగించనున్నారు. పార్టీ ఆశయాలు..సిద్ధాంతాలు..పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలపై సుదీర్ఘంగా పవన్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.
అయితే, పవన్ కు అనారోగ్యం కారణంగా అమెరికా టూర్ పై సందేహం నెలకొంది. డిసెంబర్ 13వ తేదీన ఎన్ ఆర్ ఐ జనసేన నేతలతో సమావేశం..డిసెంబర్ 15వ తేదీన డల్లాస్ లో ప్రవాస గర్జన్...అదే రోజు బహిరంగసభ ఉండే విధంగా షెడ్యూల్ చేశారు. మరి పవన్ అమెరికా పర్యటన ఉంటుందా ? లేదా ? అనేది తెలియరాలేదు.