Begin typing your search above and press return to search.

డబ్బుల్లేవనే పవన్ 1.32 కోట్ల విరాళం ఇచ్చారు

By:  Tupaki Desk   |   13 April 2019 5:38 AM GMT
డబ్బుల్లేవనే పవన్ 1.32 కోట్ల విరాళం ఇచ్చారు
X
జనసేన అధినేతగా సుపరిచితుడు.. పవర్ స్టార్ గా పరిచయస్తుడు పవన్ కల్యాణ్ ఏం చేసినా అందరి నోట్లో నానతాడు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ధోరణి ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఆయన చెప్పే మాటలు.. చేసే పనులకు పొంతన ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మిగిలిన విషయాల్లో మాదిరే.. డబ్బుల విషయాల్లోనూ పవన్ ఓపెన్ గా ఉంటారు. మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పేస్తుంటారు. తన దగ్గర పెద్దగా డబ్బుల్లేవని.. ఆర్థిక పరిమితుల గురించి మాట్లాడే ఆయన.. తాజాగా ఒక గుడికి ఏకంగా రూ.1.32 కోట్ల మొత్తాన్ని విరాళంగా ప్రకటించటం ఒక ఎత్తు అయితే.. అందుకు సంబంధించిన చెక్కును గుడికి ఇచ్చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

గుంటూరు జిల్లాలోని దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన పవన్.. స్వామివారి నిత్య అన్నదానానికి ఈ భారీ విరాళాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. డబ్బుల్లేవంటూనే ఇంత భారీగా విరాళం ఇవ్వటం పవన్ కు మాత్రమే సాధ్యమేమో?