Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ సినిమా కంప్లీట్ చేయడు కానీ డైలాగులు చెప్తున్నాడు

By:  Tupaki Desk   |   28 Dec 2020 8:30 PM IST
పవన్ కళ్యాణ్ సినిమా కంప్లీట్ చేయడు కానీ డైలాగులు చెప్తున్నాడు
X
పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఒకటి మునిగిపోయే నావ( రాజకీయం) అని తెలుసుకొని మరో సురక్షిత నావ (సినిమాలు) వైపు అడుగులు వేశాడు. రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్న పవన్ ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ గా షూటింగ్ గ్యాప్ లో అలా ఏపీలో పర్యటిస్తూ ఇలా పంచ్ డైలాగులు చెప్తూ రాజకీయ వేడి రగులుస్తున్నాడు.

పవన్ సినిమాల్లోనే కాదు.. ఈ మధ్య ఏపీలోనూ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. రైతుల సమస్యలంటూ ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అయితే పవన్ ప్రసంగాల్లో తన సినిమాలను ఎప్పుడూ తీసుకురారు. కానీ తాజాగా ఈరోజు సినిమాను గుర్తు చేసి మరీ అధికార వైసీపీని కడిగేశారు.

నివర్ తుఫాన్ తో నష్టపోయిన రైతుల సమస్యలపై ఈరోజు పవన్ మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై.. మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. వచ్చే శాసనసభ సమావేశాలలోపు నష్టపోయిన రైతులకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలని ‘మీ సీఎం సాబ్ కు ఈ వకీల్ సాబ్ హెచ్చరిక’ జారీ చేశాడని చెప్పండని జనసేనాని పవన్ హెచ్చరించాడు. లేదంటే జనసైనికులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని పిలుపునిచ్చాడు.

పవన్ సభలో ఈ డైలాగ్ బాగా పేలింది. ఎప్పుడూ సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురాని పవన్ సడెన్ గా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే వైసీపీ శ్రేణులు కూడా పవన్ కు కాస్త గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. పవన్ సినిమాలు అయితే కంప్లీట్ చేయడు కానీ పంచ్ డైలాగులు మాత్రం చెప్తున్నాడని కౌంటర్లు ఇస్తున్నాడు. అటు రాజకీయాలు సరిగా చేయడని.. ఇటు సినిమాలు పూర్తిగా కంప్లీట్ చేయకుండా పంచ్ డైలాగులు మాత్రం పవన్ బాగా పేలుస్తాడని పలువరు కౌంటర్ ఇస్తున్నారు.