Begin typing your search above and press return to search.
పవన్ కు ప్రశ్న; ఓపెన్ బ్యాలెట్ పెట్టమనండి
By: Tupaki Desk | 23 Aug 2015 8:50 AM GMTఏపీ సర్కారు ఆఫర్ చేస్తున్న ల్యాండ్ ఫూలింగ్ గురించి ఒక రైతు ఆస్తకికరమైన వాదనను తెరపైకి తీసుకొచ్చారు. భూములు ఇచ్చేందుకు ఏ ఒక్క రైతుకు ఇష్టం లేదన్నారు. దీంతో కల్పించుకున్న పవన్ కల్యాణ్.. మరి మిగిలిన గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చారు కదా అని ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సదరు రైతు అన్ని గ్రామాల్లోనూ బెదిరించి.. భయపెట్టి భూములు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘నేను వాళ్లను కూడా అడుగతా’’ అని కాస్తంత గట్టిగా మాట్లాడిన పవన్ కు సదరు రైతు.. ‘‘అన్నా ఒక పని చేయొచ్చన్నా. భూములు సేకరించిన అన్నీ గ్రామాల్లోనూ రాజధానికి భూమి ఇవ్వటం ఇష్టమా? లేదా? అన్న ఒకే ప్రశ్న మీద ఓపెన్ బ్యాలెట్ నిర్వహించమనండి. ఏ ఒక్క గ్రామం కూడా అందుకు అనుకూలంగా ఓటేయరు. ఒకవేళ అలా ఓటేస్తే.. నా పొలం ఉచితంగా ఇచ్చేస్తా’’ అని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ రాజధాని భూముల గురించి ఎన్నో వాదనలు వినిపించినా.. ఓపెన్ బ్యాలెట్ గురించి ప్రస్తావించటం ఒక ఎత్తు అయితే.. సదరు రైతు వాదనను పవన్ ఆసక్తిగా వినటం గమనార్హం.