Begin typing your search above and press return to search.

పవన్ ఢిల్లీ పర్యటన: జనసైనికులు-వైసీపీ మధ్య వార్

By:  Tupaki Desk   |   25 Nov 2020 7:00 AM GMT
పవన్ ఢిల్లీ పర్యటన: జనసైనికులు-వైసీపీ మధ్య వార్
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. బీజేపీ పెద్దలతో తాజా పరిణామాలు, కీలక అంశాలపై చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించేందుకు ఈ భేటి జరుగుతుందని సమాచారం.

అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలవలేదని.. వారి అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. రెండు రోజులుగా పవన్ ఢిల్లీలోనే మకాం వేయడంతో ఈ వార్తలు ఏపీలో హల్ చల్ చేశాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు-జనసైనికుల మధ్య వార్ మొదలైంది. పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. కనీసం ఆయనకు బీజేపీ గౌరవం ఇవ్వడం లేదని ఎద్దేవా చేస్తూ వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

వైసీపీ ప్రచారానికి జనసైనికులు సైతం ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారని.. ఆయన కూడా ప్రధాని, కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూశారని సెటైర్లు పేలుస్తున్నారు. బీజేపీ పెద్దలు బీజీగా ఉండడంతో భేటి ఆలస్యమైందని జనసైనికులు అంటున్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కౌంటర్ ఇస్తున్నారు.

ఇలా వైసీపీ, జనసేన ఫాలోవర్స్ కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సోషల్ మీడియాలో ఫైట్ యమ రంజుగా సాగుతోంది.