Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఢిల్లీ టూర్‌.. జ‌న‌సేన నేత‌ల ప్ర‌చారం ఏంటంటే!

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:30 PM GMT
ప‌వ‌న్ ఢిల్లీ టూర్‌.. జ‌న‌సేన నేత‌ల ప్ర‌చారం ఏంటంటే!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన నేత‌ల వైఖ‌రి.. మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప‌వ‌న్ ఏం చేసినా.. ఓ రేంజ్‌లో ప్ర‌చారం చేసే ఈ జ‌న‌సేన నేత‌లు ఎప్పుడూ ఏదో ఒక హ‌డావుడి చేస్తూనే ఉంటారు. ఆయ‌న పుస్త‌కం ప‌ట్టుకుని చ‌దివినా.. లేక క‌ప్పు టీ తాగినా.. అదో వింత ప్ర‌చారం.. దీనికి ప్ర‌జ‌ల‌కు ముడిపెట్టి.. మా నేత‌.. ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల కోసం కిందికిదిగి వ‌ర్చార‌ని.. వింత ప్ర‌చారం చేసుకోవ‌డం అలవాటైపోయింది. ఇది ప్ల‌స్సా.. మైన‌స్సా.. అనేది కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. `ఇదో ర‌కం భ‌జ‌న‌` అనుకుని తృప్తి ప‌డాల్సిందే. తాజాగా ప‌వ‌న్‌.. ఢిల్లీ టూర్‌కు వెళ్లారు. ఇది ముందుగా ప్ర‌చారంలోకి రాలేదు. ఆయ‌న ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత‌.. విష‌యం వెలుగు చూసింది.

వాస్త‌వానికి ఈ టూర్‌కు ప్ర‌త్యేక‌త అంటూ ఏమీ లేదు. కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి.. త‌న కుమార్తె వివాహ విందును ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. దీనికి దేశంలోని కొంద‌రు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. ఈ కోవ‌లోనే ప‌వ‌న్‌కు కూడా ఆహ్వానం అందింది. ఆయ‌న వెళ్లారు. అయితే.. దీనిపై జ‌న‌సేన నేత‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో ఊద‌ర గొడుతున్నారు. మా నాయ‌కుడు.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇక‌, బీజేపీ నేత‌ల‌తోనూ చ‌ర్చిస్తారు! అందుకే వెళ్లారు.. అంటూ.. ప్ర‌చారం ప్రారంభించారు. ఇక‌, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్‌.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజును క‌లిశారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను.. జ‌న‌సేన నాయ‌కులు విడుద‌ల చేశారు.

ఇంకేముంది.. రాజ‌కీయ వ్య‌వ‌హారంపైనే ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లార‌ని.. ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాను కూడా క‌లుస్తార‌ని.. ఏపీలో పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చిస్తార‌ని.. ఏపీ ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు కూడా చేస్తార‌ని.. ఇలా అనేక విష‌యాలు క‌ల‌గ‌లిపి మ‌రీ.. వింత ప్రచారం చేయ‌డం.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ కావ‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ప‌వ‌న్‌కు బీజేపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు అంద‌లేదు. అంది ఉంటే.. పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల నేత‌.. మ‌నోహ‌ర్ మీడియాకు చెప్పి ఉండేవారు. ప‌వ‌న్ అనుకూల మీడియాలోనూ ఈ అంశంపై ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా వ‌చ్చి ఉండేవి . సో.. ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త వ్యవ‌హారం అయినా.. కూడా జ‌న‌సేన నేత‌లు మాత్రం ఆర్భాటం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కేంద్రంలో బీజేపీనేత‌ల ప‌రిస్థితి చూస్తే.. ఇప్పుడు ప‌వ‌న్‌తో చ‌ర్చించేందుకు ఎలాంటి అంశం వారి వద్ద‌లేదు. ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక స‌మ‌యంలోనూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతోనే ప‌వ‌న్ భేటీ పెట్టుకున్నారు. కీల‌క నేత‌ల‌కు దూరంగానే ఉన్నారు. ఇక‌, ఇప్ప‌ట్లో ఏపీలో ఎన్నిక‌లు లేవు. పైగా.. ఏపీ వ్య‌వ‌హారాలు కేంద్రంలోని బీజేపీ నేత‌ల‌కు తెలియ‌ని కూడా కావు. ఇక‌, ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయ‌డం అనే అంశం కూడా ఇప్పుడు కేంద్ర పెద్ద‌లు పెద్ద‌గా దృష్టి పెట్టే అవ‌కాశం లేదు. వారికి ఇప్పుడు ఉన్న‌ద‌ల్లా యూపీ స‌హా ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల‌పై మంత్రాంగ‌మే. అయినా కూడా ప‌వ‌న్ కీల‌కంగా మారార‌ని.. ఢిల్లీలో చ‌క్రం తిప్పేందుకు వెళ్లార‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌చారం చేయ‌డం.. ఒకింత హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.