Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మాట‌: 'నా త‌ల్లి ఆత్మాభిమానాన్ని నేను ర‌క్షించ‌కుంటే..'

By:  Tupaki Desk   |   20 April 2018 5:23 AM GMT
ప‌వ‌న్ మాట‌: నా త‌ల్లి ఆత్మాభిమానాన్ని నేను ర‌క్షించ‌కుంటే..
X
అవును.. త‌ప్పుగా మాట్లాడింది.. సారీ చెప్పేసిందిగా? ఇంకా ఇష్యూ ఏంది? అంటూ సింఫుల్ గా తేల్చేసేవాళ్లు గ‌డిచిన రెండు.. మూడు రోజుల్లో టీవీల్లో క‌నిపిస్తూనే ఉన్నారు. ప‌వ‌న్ త‌ల్లిని ఉద్దేశించి సినీ న‌టి శ్రీ‌రెడ్డి అన‌కూడ‌ని మాట అన‌టం..అస‌భ్య‌క‌ర‌మైన మాట అన‌టం ఎంత సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే.

తాను అన్న మాట తాను అన్న‌ది కాద‌ని.. ఎవ‌రో చెప్పిన స‌ల‌హాతో తాను అన్నాన‌ని..క్ష‌మించాలంటూ శ్రీ‌రెడ్డి సారీ చెప్పేశారు. అంత‌లోనే.. శ్రీ‌రెడ్డిని ఆ మాట అన‌మ‌ని ప్ర‌భావితం చేసింది తానేన‌ని ఒప్పేసుకుంటూ త‌న‌ను క్ష‌మించాలంటూ సారీ చెప్పేశారు ద‌ర్శ‌కులు రాంగోపాల్ వ‌ర్మ‌. ఈ ఉదంతంపై అదే ప‌నిగి చ‌ర్చ‌లు పెడుతున్న టీవీ ఛాన‌ళ్ల‌లో గంట‌ల కొద్దీ అదే ప‌నిగా కూర్చొని త‌ప్పు ఏది? రైటు ఏద‌ని తేల్చేసే క‌త్తి మ‌హేశ్ లాంటోళ్లు అయితే.. చాలా సింఫుల్ గా.. అవును అలా అన‌టం త‌ప్పు.. సారీ చెప్పేశారు.. అక్క‌డితో ఇష్యూ అయిపోయిందంటూ వ్యాఖ్యానించ‌టం క‌నిపిస్తుంది.

అన్న‌వాళ్లు సింఫుల్ గా సారీ చెప్పేయొచ్చు. కానీ..ఇక్క‌డ ఆ మాట ప‌డిన వాళ్ల‌కు ఒక మ‌నసు ఉంటుంద‌ని.. వారికి భావోద్వేగాలు ఉంటాయ‌ని.. వారికి హ‌క్కులు ఉంటాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతారా? లేక‌.. కొంద‌రికి మాత్ర‌మే హ‌క్కులు.. మిగిలిన వారికి పెద్ద‌గా ఉండ‌వ‌ని అనుకుంటారో తెలీదు కానీ.. అంత పెద్ద మాట అన్న‌వారిని చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించాల‌న్న చిన్న మాట‌ను అన‌ని వైనం క‌నిపిస్తుంది. అంతేనా.. సారీ చెప్పిన త‌ర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది.. మ‌ళ్లీ దాని గురించే ఎందుకు మాట్లాడాలంటూ తేలిగ్గా తీసేసే పెద్ద మ‌నుషులు సైతం.. ఎవ‌రో ఏదో అన్నార‌ని అదే ప‌నిగా టీవీ స్టూడియోలో కూర్చొని గంట‌ల త‌ర‌బ‌డి త‌మ ఆవేద‌న‌ను ఎందుకు చెప్పుకున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు.

త‌న త‌ల్లిని ఉద్దేశించి శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌పై ప‌వ‌న్ తాజాగా స్పందించారు. రాత్రి వేళ‌లో ట్వీట్లు చేసిన ప‌వ‌న్‌.. త‌న త‌ల్లిని అన్న మాట‌పై తానెంత‌గా హ‌ర్ట్ అయ్యార‌న్న విష‌యాన్ని తాజా ట్వీట్ ద్వారా చెప్పేశారు.ప‌వ‌న్ ట్వీట్ చ‌దివిన త‌ర్వాత‌.. త‌న కార‌ణంగా త‌న త‌ల్లి అంత మాట ప‌డ్డార‌న్న బాధ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క‌మాన‌దు.

అంతేనా.. అంద‌రి మంచి మాత్ర‌మే కోరుకునే త‌న త‌ల్లిని ప‌ట్టుకొని అంత మాట అన‌టం.. దాన్ని అదే ప‌నిగా మీడియాలో చూపిస్తూ.. చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రిపే టీవీ ఛాన‌ళ్ల‌పైనా త‌న‌కున్న ఆగ్ర‌హాన్ని ప‌వ‌న్ త‌న తాజా ట్వీట్లో స్ప‌ష్టంగా చెప్పేశారు. నా త‌ల్లి ఆత్మాభిమానాన్ని నేను ర‌క్షించ‌కుంటే బ‌తికుండే క‌న్నా చావ‌టం మేల‌న్న ఘాటు వ్యాఖ్య‌ను కూడా చేశారు. ఎవ‌రికి ఎలాంటి అప‌కారం చేయ‌కుండా.. త‌న మానాన తాను బ‌తికే ఒక దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి త‌ల్లిని ఉద్దేశించి.. ఏ కొడుకూ విన‌కూడ‌ని మాట‌ను న‌డిబ‌జార్న అనిపించేసిన వైనంపై ప‌వ‌న్ ఆవేద‌న చూస్తే.. ఈ ఉదంతం ఆయ‌న్ను ఎంత‌లా హ‌ర్ట్ చేసిందో అర్థ‌మ‌వుతుంది.

రాత్రివేళ‌.. పొద్దుపోయిన త‌ర్వాత ప‌వ‌న్ చేసిన ఈ ట్వీట్ల‌ను చూస్తే.. ఆయ‌నెంత‌గా హ‌ర్ట్ అయ్యారో తెలుస్తుంది.

"మీకు చ‌దువులు ఉండి.. కుటుంబాలు ఉండి..అక్కాచెల్లెళ్లుఉండి.. కోడ‌ళ్లు.. కూతుళ్లు ఉండి.. పేరు ప్ర‌ఖ్యాతులు ఉండి.. సంప‌ద‌ను కూడ‌పెట్టుకొని.. అన్నింటికి మించి స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే స్థాయిల్లో.. మాథ్య‌మాల్లో ఉన్న మీరంద‌రూ.. క‌లిసి.. "

"ఒక దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి మ‌హిళ‌ను.. భ‌ర్త‌.. పిల్ల‌లు త‌ప్ప ఇంకో ప్ర‌పంచం తెలియ‌ని నా క‌న్న‌త‌ల్లిని.. ఎవ‌రికి ఉపకారం త‌ప్ప అప‌కారం అనేది ఆలోచ‌న‌ల్లో కూడా చేయ‌ని.. నాకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిని.. మీరంద‌రూ క‌లిసి న‌డిరోడ్డులో ఏ కొడుకు కూడా విన‌కూడ‌ని ఒక త‌ప్పుడు ప‌దాన్ని అన‌మ‌ని స‌ల‌హాలు చెప్పి.. అనిపించి.. దానిని ప‌దే ప‌దే ప్ర‌సారం చేసి.. ఆ త‌ర్వాత దానిపైన డిబెట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్య‌క్తులు ఇంత దిగ‌జారిగ‌లిగిన‌ప్పుడు.. అసిపా లాంటి ముక్క‌ప‌చ్చ‌లార‌ని ప‌సిపిల్ల‌ల‌ను.. అభం శుభం తెలియ‌ని ప‌సిపిల్ల‌ల‌పై దారుణ‌మైన అత్యాచారాలు చేసే నీచులు.. నికృష్టులు ఎందుకు ఉండ‌రు? కొల్ల‌లుగా ఉంటారు"

"మీరంతా క‌లిసి స‌మాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా.. మీకు అండ‌గా నిల‌బ‌డ్డ మీ త‌ల్లిదండ్రుల‌కి.. మీ అక్క‌చెల్లెళ్ల‌కు.. మీ కూతుళ్ల‌కి.. కోడ‌ళ్ల‌కి మీ ఇంటిల్లిపాదికి నా హృద‌య‌పూర్వ‌క వంద‌నాలు. నా త‌ల్లి ఆత్మాభిమానాన్ని నేను ర‌క్షించ‌కుంటే బ‌తికుండే క‌న్నా చావ‌టం మేలు"