Begin typing your search above and press return to search.
పొత్తులపై పవన్.. తికమక.. మకతిక..!
By: Tupaki Desk | 25 Jan 2023 8:44 AM GMTమళ్లీ అదే పంథా.. మళ్లీ అవే కామెంట్లు.. ఏమాత్రం మార్పు కనిపించడం లేదు! ఇదీ.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతామని ఆయన పదే పదే చెబుతున్నారు. అయితే.. ఎవరితో పొత్తు.. ఎలా పొత్తు.. ఎప్పుడు పొత్తు అనే మూడు విషయాల్లో మాత్రం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పార్టీలను తర్జన భర్జనలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై నెటిజన్లు.. కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
గత ఎన్నికల్లో ఒంటరి పోరు అంటూ.. కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి వెళ్లిన పవన్‌కు.. అందునా.. మాయావతి వంటి ఉత్తరాది రాజకీయ దిగ్గజానికి స్టేజీలపై పడి పడి దండాలు పెట్టినా..ఒక్క ఎస్సీ స్థానంలోనూ జనసేనకు ఆశించిన ఓట్లు పడలేదు. ఇక, ఇప్పుడైనా.. ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచేపొత్తులు పెట్టుకుంటే..అవి పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనేది మేధావుల మాట.
అయితే.. ఇప్పటి వరకు పవన్ ఈ విషయంలో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. కొద్దిసేపు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నారు. మరికొంత సేపు పొత్తులు పెట్టుకుంటానని కూడా అంటున్నారు. అయితే.. దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఒకవైపు.. ఎన్నికల వేడి ఏపీలో రాజుకుంది. దీంతో అధికార పార్టీ వ్యూ హ ప్రతివ్యూహాలు అమలు చేస్తోంది. దీనికి తగిన విధంగా ముందుకు వెళ్లాలని పార్టీలు భావిస్తున్నాయి.
అయితే, పవన్ తో చేతులు కలిపేందుకు రెడీగా ఉన్న టీడీపీ సహా వామపక్షాలు ఇప్పటికీ ఆయన ఎటూ తేల్చకపోవడంతో తర్జన భర్జనకు గురవుతున్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు చేయించిన పవన్.
ఆ వెంటనే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వకుండా చూస్తానని చెప్పానని, ఆ మాటను తాను నిలబెట్టుకుంటానని అన్నారు. అయి తే.. ఈ క్రమంలో పొత్తులపై తనదైన శైలిలోనే ఆయన రియాక్ట్ అయ్యారు.
ప్రస్తుతం తాను బీజేపీతోనే పొత్తులో ఉన్నానని..వారు కాదంటే ఒంటరిగానే పోటీ చేస్తానని.. బాంబు పేల్చారు. అదేసమయంలో తనతో కలిసి పోటీ చేయాలని అనుకునే పార్టీలు ముందుకు రావాలని అన్నారు. అంతేకాదు.. ఎన్నికలకు వారం ముందు మాత్రమే పొత్తులపై క్లారిటీ ఇస్తామన్నారు. ఇదంతా చూస్తే.. పవన్‌కు పొత్తులపై క్లారిటీ లేదా?? లేద ప్రజలు తాను ఏం చేసినా.. అనుకూలంగా ఉంటారని భావిస్తున్నారా? అంటూ.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.