Begin typing your search above and press return to search.

ఆ సినీ నిర్మాత‌కు ప‌వ‌న్ టికెట్ ఓకే చేసేశాడా?

By:  Tupaki Desk   |   7 May 2018 6:52 AM GMT
ఆ సినీ నిర్మాత‌కు ప‌వ‌న్ టికెట్ ఓకే చేసేశాడా?
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీకి సంబంధించిన ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్నారా? త‌న అనుకున్న‌వాళ్ల‌కు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన నాయ‌కుల‌కు గౌర‌వం ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. జ‌న‌సే పార్టీ కార్యాక్ర‌మాల‌ను గ‌మ‌నించిన వారి అభిప్రాయం ప్ర‌కారం ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్ ఒక‌రిటి ఆయ‌న టికెట్‌ ఖ‌రారు చేసేశారట‌. పార్టీ కోసం ఆ ప్ర‌ముఖుడు చేస్తున్న సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ నిర్ణ‌యానికి ప‌వ‌న్ వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ సినీ ప్ర‌ముఖుడే ప్రొడ్యూస‌ర్‌ - ఎంట‌ర్‌ ప్రెన్యూర్ అయిన రామ్ తాళ్లూరి.

రామ్ తాళ్లూరి విష‌యానికి వ‌స్తే లీడ్ కార్పొరోష‌న్‌ - రామ్ ఇన్నోవేష‌న్స్‌ - రామ్ ఎంట‌ర్‌ ప్రైజెస్ (స్కై జోన్‌) మ‌రియు ట్యూట‌ర్ వెబ్‌ కు డైరెక్ట‌ర్‌ గా ఉన్నారు. ఐటీ ప‌రిశ్ర‌మ‌లో14 ఏళ్ల అనుభ‌వం సంపాదించిన‌ రామ్ అనంత‌రం సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్రకారం గ‌త కొద్దికాలంగా జ‌న‌సేన పార్టీకి రామ్ తాళ్లూరి నిధులు స‌మ‌కూర్చ‌డంతో పాటుగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నారు. జ‌న‌సేన పార్టీకి చెందిన ఎన్నారై విభాగాల కార్య‌క‌లాపాలు ముఖ్యంగా పార్టీ అమెరికా విభాగానికి చెందిన కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న స‌మ‌న్వ‌యం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నారై విభాగం స‌మావేశం కూడా రామ్ నేతృత్వంలోనే అని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌న్నింటినీ క్రోడీకరిస్తే రాబోయే ఎన్నిక‌ల్లో రామ్ జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన అధ్య‌క్షుడ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఆయ‌నకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ విష‌యంలో అధికార ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

కాగా, రామ్ తాళ్లూరికి చెందిన తాజా సినిమా నేల టికెట్‌ కు జ‌న‌సేన ర‌థ‌సార‌థి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ కు - రామ్‌ కు ఉన్న దోస్తీ విష‌యంలో ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని ఆయ‌న‌కు పార్టీ టికెట్ ద‌క్క‌డం ఖరారైపోయింద‌ని అంటున్నారు. పార్టీ అధికారికంగా స్పందిస్తేనే ఈ విష‌యంలో క్లారిటీ రానుంది.