Begin typing your search above and press return to search.
పవన్ జనసేన నినాదం మారింది
By: Tupaki Desk | 12 April 2016 10:42 AM GMTప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా.. అని రెండేళ్ల కిందట ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అందరినీ బాగానే ఆకర్షించింది. ఐతే మొదట్లో మంచి నినాదంగా ఉన్నది తర్వాత తర్వాత పెద్ద జోక్ లాగా మారిపోయింది. చాలా అంశాలపై పవన్ ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉండేసరికి.. ప్రశ్నించడానికి వచ్చినవాడు ఏమైపోయాడు అంటూ సెటైర్లు పడ్డాయి పవన్ మీద. ఐతే ఈ సెటైర్ల ప్రభావమో ఏంటో కానీ.. ఇకపై ఈ నినాదాన్ని పక్కనబెట్టేయాలని భావిస్తున్నట్లున్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా అప్పుడప్పుడూ తానెందుకు సైలెంటుగా ఉంటానో వివరణ ఇస్తూ చివరగా.. ‘‘జనసేన ఉన్నది ప్రశ్నించడానికి కాదు.. తెలియజెప్పడానికి’’ అన్న కంక్లూజన్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికే 2019 ఎన్నికల్లో పోటీ పడబోతున్నారా అంటే.. ఎంత మాత్రం కాదన్న పవన్.. ఓటమికి కూడా సిద్ధపడే.. దెబ్బలు తినడానికి కూడా రెడీ అయ్యే బరిలోకి దిగబోతున్నట్లు చెప్పాడు. అన్నయ్య చెప్పాడు కదా.. సినిమాలు మనేయవద్దని.. మరి ఆయన మాట ధిక్కరిస్తారా అని అడిగితే.. ‘‘దీన్ని ధిక్కరించడం.. మాట వినకపోవడం అనుకోవద్దు. ఆయన చెప్పినా ఎవ్వరు చెప్పినా నాకు నచ్చనిది నేను చేయను. నేను యాక్టివ్ పాలిటిక్స్ లో లేనపుడే.. కొన్నిసార్లు షూటింగ్ ఆపుకుని కొన్ని ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది. కొన్ని చోట్లకు వెళ్లాల్సి వచ్చింది. అలాంటిది ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్లాక మళ్లీ సినిమాలు చేయడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. ప్రాక్టికల్ గా ఇది సాధ్యం కాదు. నేను ఏ పనైనా వందశాతం చిత్తశుద్ధితో చేయాలనుకుంటా. అందుకే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక.. సినిమాలకు దూరం కావాలి అన్నది నాకు నేను పెట్టుకున్న షరతు. ఇందులో అన్నయ్యను ధిక్కరించడం.. అమర్యాదగా ప్రవర్తించడం.. మాట వినకపోవడం లాంటి వాటికేమీ ఆస్కారం లేదు’’ అని పవన్ స్పష్టం చేశాడు.