Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ చుట్టూ ఉన్నోళ్ల గురించి షాకింగ్ మాట‌లు చెప్పారు

By:  Tupaki Desk   |   28 Jan 2019 10:42 AM GMT
ప‌వ‌న్ చుట్టూ ఉన్నోళ్ల గురించి షాకింగ్ మాట‌లు చెప్పారు
X
త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ విజ‌య ఢంకా మోగిస్తుంది. అమ‌రావ‌తి మీద జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడుతుందంటూ వీరావేశంతో గుంటూరు స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన డైలాగ్ కు అక్క‌డి అభిమానులంతా ఆనందంతో కేరింత‌లు కొట్టారు. సాధ్య‌మా? కాదా? అన్న విష‌యాన్ని అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కొన్ని సంద‌ర్భాల్లో లాజిక్కుల‌తో సంబంధం లేకుండా కొన్ని మాట‌లు విన్నంత‌నే సంబ‌ర‌ప‌డిపోతుంటాం. ప‌వ‌న్ ఆవేశ‌పు డైలాగులు కూడా ఇలాంటివే.

ఇంకేం ఉంది? త‌మ పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చేసినట్లే అన్న‌ట్లుగా చెప్పే డైలాగులు అతికిన‌ట్లుగా ఉండాలి. వాస్త‌వ రూపంలో దాల్చేవిగా ఉండాలి. లేనిపక్షంలో మొద‌టికే మోసం ప‌క్కా. కొంద‌రు అధినేత‌లు చెప్పే డైలాగుల‌కు విశేష ప్ర‌చారం ద‌క్కుతుంది. అవి ఉత్త మాట‌లుగా తేలిన త‌ర్వాత వారిపై ఉండే మ‌ర్యాద‌.. గౌర‌వం.. వారి మాట‌ల‌కు విలువ త‌గ్గుతుంది. అందుకే.. అధినేత‌లుగా ఉన్న వారు బ‌డాయి మాట‌లు చెప్ప‌టం వ‌ల్ల తాత్కాలిక ప్ర‌యోజ‌నం క‌నిపించినా.. దాని వ‌ల్ల న‌ష్ట‌మే ఎక్కువ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

ప‌వ‌న్ మాట‌ల్నే చూద్దాం. ఆయ‌న అధికారాన్ని అర‌చేతిలో పెట్టుకొని తిరుగుతున్న‌ట్లుగా.. ఆంధ్రోళ్లు ఆయ‌న‌కు రాజ దండం ఇవ్వ‌టానికే ఉన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు. వాస్త‌వం అంద‌రికి తెలిసిందే. రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌నీస ప్ర‌భావాన్ని చూపుతారా? అన్న‌ది కూడా ప్ర‌శ్నే. ఇలాంటివేళ‌లో హ‌డావుడి డైలాగుల‌తో ఒరిగేదేమీ ఉండ‌దు. ఒక‌వేళ‌.. అలా చెప్ప‌టం ద్వారా క్యాడ‌ర్లోనూ.. నేత‌ల్లోనూ ఉత్సాహం నింపాల‌న్న‌దే ప‌వ‌న్ ఆలోచ‌న అయితే.. ఆయ‌న చెప్పిన మాట‌లు అస్స‌లు చెప్ప‌కూడ‌దు.

ఏ రాజ‌కీయ అధినేత కూడా ఈ త‌ర‌హాలో మాట్లాడ‌రు. త‌మ పార్టీలో వెన్నుపోటుదారులు మ‌స్తుగా ఉన్న‌ట్లుగా చెప్ప‌టం ప‌వ‌న్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో? త‌న ప‌క్క‌న ఉన్నోళ్లంతా నీతిమంతులేన‌ని తాను చెప్ప‌న‌ని.. అవినీతిప‌రులు ఉన్నార‌ని తెలిసినా తాను పార్టీలో చేర్చుకుంటామ‌ని చెప్ప‌టం ద్వారా.. ప‌వ‌న్ చేసే రాజ‌కీయాలుఎలా ఉంటాయ‌న్న దానిపై ఒక క్లారిటీ వ‌చ్చే ప‌రిస్థితి. నిజాయితీగా..ఓపెన్ గా చెబుతున్న‌ట్లు చెప్పినా.. పార్టీలో చేర్చుకునే ప్రాధ‌మిక ఎంపిక‌లోనే తెలిసి త‌ప్పు చేస్తే.. అలాంటి అధినేత నేతృత్వంలో ప‌డే అడుగులు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

సుద్ద‌పూస‌లు.. ఆణిముత్యాల్ని మాత్ర‌మే కాదు.. ఎలాంటి వారినైనా త‌న పార్టీలోకి చేర్చుకుంటాన‌ని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్.. దానికో అద్భుతమైన క‌వ‌రింగ్ ఇవ్వ‌టం క‌నిపిస్తుంది. బుర‌ద‌లోంచే క‌మ‌లం పుడుతుంద‌ని ఆయ‌న చెప్ప‌టం చూస్తే.. ఆయ‌న‌లోని క‌న్ఫ్యూజ‌న్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప‌గ‌లంతా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌.. రాత్రికి టీడీపీ నీడ‌న చేరేవాళ్లు ఉన్నార‌ని చెప్పిన ప‌వ‌న్ మాట‌లు చూస్తే.. ఒక్క మాట మ‌న‌సులో చ‌టుక్కున రాక మాన‌దు.

అయ్యా ప‌వ‌న్ బాబు.. అస్త‌వ్య‌స్తంగా ఉన్న ఏపీని ఏదో చేయాల‌న్న క‌ల‌లు కాస్త ఆపి.. ముందు పార్టీని చ‌క్క‌దిద్దుకో అని చెప్పాల‌నిపించ‌క మాన‌దు. త‌న చుట్టూ ఉండేవాళ్లు ప‌గ‌లు త‌న‌తో.. రాత్రికి బాబు పార్టీతో దోస్తానా చేస్తాన‌ని చెప్పే ప‌వ‌న్ లాంటి అధినేత‌ల‌తో ఏపీకి ఎంత వ‌ర‌కు ప్ర‌యోజ‌నం అన్న‌ది ఎవ‌రికి వారు ప్ర‌శ్నించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.