Begin typing your search above and press return to search.

విలువలు వద్దు....విరాళాలే ముద్దు

By:  Tupaki Desk   |   4 Oct 2018 5:38 AM GMT
విలువలు వద్దు....విరాళాలే ముద్దు
X
రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ ప్రచారానికి - ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. కాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరందరి కంటే కొంచెం ఘనడు. పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా ఏకంగా విరాళాల ఖాతా తెరి చేసారు. జనసేనకు విరాళాలు ఇవ్వండి అంటూ బహిరంగంగానే జనసేన పార్టీ విరాళాల బాట పట్టింది. ఇన్ని రోజులుగా విరాళాలు అడగడానికి సిగ్గు పడ్డ పవన్ కల్యాణ్ - రాజకీయాలలో విలువలకు పోతే వలువలు ఉండవని తెలుసుకున్నారో ఏమో.... జనసేనకు విరాళాలు ఇవ్వండి అంటూ జనసేన అభిమానులకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఆయ‌న పిలుపును విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో జనసేన పార్టీకి అటు భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీ నుంచి అండదండలు ఉన్నాయి కాబట్టి పవన్ కల్యాణ్ నెగ్గుకు రాగలిగారు. కాని రాబోయే ఎన్నికలలో జనసేన వంటరిగానే బరిలోకి దిగేందుకు సన్నద్దమవుతోంది. బహిరంగా సభలకు గాని, ఇతరత్ర కార్యక్రమాలకు గాని ఖర్చు అవుతుండడంతో ఇంక ఆయన విరాళల బాట పట్టక తప్పలేదు.

గతంలో పవన్ కల్యాణ‌్ ఎప్పుడూ కూడా విరాళాలు అడగలేదు. జనసేన నాయకులు తమ స్వంత డబ్బునే ఖర్చు చేశారు. గతంలో జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం సపోర్టు ఉండడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. గతంలో చాలా మంది అభ్యర్దులు విరాళాలు ఇద్దామని అనుకున్న - పవన్ కల్యాణ్ సున్నితంగానే తిరస్కరించారు. అభ్యర్దుల నుంచి విరాళాలు తీసుకుంటే ఎన్నికల సమయంలో టిక్కెట్లు కేటాయింపు విషయంలో సమస్యలు వస్తాయని ఆయన భావించారు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో నెగ్గుకు రావాలంటే మదుపు పెట్టక తప్పదని పవన్ కల్యాణ్‌ కు తెలసి వచ్చినట్లుంది, అందుకే ఆయన కూడా అందరి బాటే పట్టారు. అయితే చిన్న మొత్తంలో విరాళాలు పార్టీకి అక్కరకు రావని - వీటి కోసం వారికి ఆర్దికంగా బలమైన వారినే చూసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలలో నెగ్గుకు రావలంటే పెద్దల అండ ఉండాలని వారంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీలో టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్దులు పవన్ కల్యాణ్ చూపు తమ వైపు తిప్పుకోవడం కోసం విరాళాల సేకరణలో పడ్డారు. ఎక్కువ మొత్తంలో విరాళలు సేఖరించి - తద్వారా టిక్కెట్లు పొందవచ్చిన అభ్యర్దులు అనుకుంటున్నట్లు సమాచారం.