Begin typing your search above and press return to search.

అనంత‌లో ప‌వ‌న్ పోటీ చేసేది ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   14 March 2017 4:44 PM GMT
అనంత‌లో ప‌వ‌న్ పోటీ చేసేది ఎక్క‌డ‌?
X
ప్ర‌శ్నించ‌టం కోస‌మే పార్టీ పెట్టాన‌ని చెబుతూ.. ఆన్ అండ్ ఆఫ్ రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ ఈ మ‌ధ్య‌న ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరుతో బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. తాజాగా పార్టీ పెట్టి మూడేళ్లు పూర్తి అయిన వేళ‌.. మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆయ‌న త‌న భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ గురించిన వివ‌రాల్ని వెల్ల‌డించటంతో పాటు.. రెండు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అందులో ఒక‌టి త‌మ పార్టీ 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తుంద‌న్న‌ది ఒక‌టైతే.. తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని వెల్ల‌డించారు.

ఆ మ‌ధ్యన అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా తాను అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని.. అనంత క‌ర‌వు గురించి తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌న మాట‌ల్ని మ‌ర్చిపోకుండా.. ఎన్నిక‌ల్లో అనంత నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. అనంత‌పురం జిల్లాలో పోటీ చేసే ప‌క్షంలో ఆయ‌న ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

కుల‌.. వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల్ని లెక్క‌లోకి తీసుకుంటే.. ప‌వ‌న్ అనంత‌పురం అర్బ‌న్ నుంచి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు మొండుగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇక్క‌డ‌. ప‌రిస్థితులు అనుకూలంగా ఉండ‌టంతో పాటు.. బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల‌కు సంబంధించిన బ‌ల‌హీన‌త‌లు ప‌వ‌న్‌కు వ‌రంగా మార‌తాయ‌న్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. గ‌తంలో తాను చెప్పిన మాట‌కు త‌గ్గ‌ట్లే అనంత నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/