Begin typing your search above and press return to search.
పవన్ గర్జన కాస్త మారింది
By: Tupaki Desk | 18 Feb 2017 2:18 PM GMTపార్ట్ టైం పొలిటీషియన్ గా పడిన ముద్రను వదిలించుకోవటానికి తెగ ప్రయత్నిస్తున్నారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాలు.. రాజకీయాలు రెండింటి మీదన ఫోకస్ చేస్తూ.. రెండింటికి న్యాయం చేయాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు చేయాలంటే డబ్బు అవసరం ఉండటం.. ఆ డబ్బు కోసం ఆయన సినిమాలు చేయక తప్పనిసరి. అలా అని సినిమాలు చేయటం ఏమైనా ఆసక్తి ఉందా? అంటే లేదనే మాటను ఆయన పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.
పార్టీ నడపటానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం కావటం.. బయట నుంచి నిధులు ఇస్తామన్న వారి దగ్గర నుంచి తీసుకొని పార్టీని నడిపిస్తే.. ఆ తర్వాత తనపై ఒత్తిడి ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన పవన్.. అలాంటి ఆర్థిక సాయాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే.. గతంలో మాదిరి ఆచితూచి సినిమాలు తీయకుండా.. కాస్త జోరుగానే సినిమాల్ని వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.
తనకున్న మార్కెట్ కారణంగా.. వరుసగా సినిమాలు తీయటం ద్వారా.. పొలిటికల్ అవసరాలకు నిధుల కొరత లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో. ప్రతి నెలకు.. లేదంటే కాస్త అటూఇటూగా నెలన్నరకు ఒకటి చొప్పున సభ పక్కాగా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్న పవన్.. తాజాగా గుంటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చేనేత సమస్యపైన ఆయన గళం విప్పేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే.. సభను తొలుత పద్మశాలీల గర్జనగా పేర్కొన్నారు.
తనలాంటి వాడికి కులాలు అస్సలు పట్టవని చెప్పే పవన్.. తానే కులాల తరఫున సభ పెడితే రాంగ్ సిగ్నల్స్ పోతుందన్న ఉద్దేశంతో చేనేత గర్జన అంటూ పేరు మార్చేశారు. ఈ నెల 20న గుంటూరులో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్షమంది వరకూ వస్తారన్న అంచనా వినిపిస్తోంది.చేనేత గర్జనపేరు మార్చటం ద్వారా.. ఈ వృత్తి మీద ఆధారపడిన 18 కులాల్నిఏకం చేయటం.. చేనేత సమస్యపై తన వాదనను వినిపించి.. రాష్ట్రసర్కారు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపే వీలుందని చెబుతున్నారు. మరి.. పేరు మార్చిన ఈ చేనేత గర్జనలో పవన్ సందేశం ఎలా ఉంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/