Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మ‌ళ్ళీ మాట మార్చాడేంట‌బ్బా...!

By:  Tupaki Desk   |   29 Oct 2019 2:30 PM GMT
ప‌వ‌న్ మ‌ళ్ళీ మాట మార్చాడేంట‌బ్బా...!
X
నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ ఎంత పాపుల‌రో మ‌నం తెలిసిందే. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ఇది ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాడిన డైలాగ్‌. ఇది ఎంత‌గా హిట్ అయిందంటే దీన్ని జ‌నాలు బాగానే ఒంట‌బ‌ట్టించుకున్నారు. అయితే ఇక్క‌డ ఈ డైలాగ్ ఎవ‌రైతే వాడారో ఆయ‌న‌కే ఇప్పుడు అతి స‌రిగ్గా స‌రిపోయేలా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు నిజంగానే తిక్కుంది అని నిరూపిస్తున్నారు. ఎందుకంటే తాను అన్న‌మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తిని కాద‌ని త‌నే ప్ర‌తిసారి రుజువు చేస్తూనే ఉన్నారు. తాను ఏ మాట అయితే చెపుతారో ఆ మాట మీద నిల‌బ‌డే త‌త్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు లేద‌ని తేట‌తెల్లం అవుతూనే ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు తాను మాట త‌ప్పేలా క‌నిపిస్తున్నారు.

జ‌న‌సేన పార్టీ స్థాపించిన స‌మయంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించారు. ఆ 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీల‌కు ఊతంగా మారి ఆ ఎన్నిక‌ల్లో వారికి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత వారితో తెగ‌తెంపులు చేసుకున్నారు. చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డం త‌రువాత వారితో దోస్త్ క‌టీఫ్ చేసుకోవ‌డం - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ త‌న‌కు బాగా తెలుసంటారు. ప్ర‌త్యేక హోదా తెమ్మంటే తేలేదు. త‌రువాత బీజేపీకి దూర‌మ‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంటరి పోటీ అన్నారు. క‌మ్యూనిస్టుల‌తో జ‌త‌క‌ట్టారు. లోపాయికారిగా టీడీపీ - బీజేపీకి స‌హాకరించార‌నే అప‌వాదు ఉంది.

ఇక టీడీపీ - బీజేపీలు మోసం చేసే పార్టీలు అంటూనే వారితో దోస్తానాకు సై అంటారు. ఇక ఏదైనా పోరాటం చేస్తానంటారు. అది మ‌ద్య‌లోనే వ‌దిలేసి పారిపోతారు. ఇక కొంత కాలం పోరాటం చేస్తారు. కొంత కాలం కార్య‌క‌ర్త‌లకు అందుబాటులోనే ఉండ‌రు. కొంత కాలం సినిమాల్లో న‌టించ‌ను గాక న‌టించ‌ను అంటారు. మ‌రోవైపు సినిమాల్లో న‌టించేందుకు క‌థ‌లు వింటున్న‌ట్టు టాక్‌. మంచి క‌థ కుదిరితే న‌టించేందుకు సిద్ద‌మనే టాక్ వినిపిస్తోంది. ఓవైపు సినిమాలు చేయ‌నన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోమారు రంగుల ప్ర‌పంచంలో బ‌తికేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

అంటే ఇప్పుడు ఇసుక పోరాటం - భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు అండ‌గా పోరాటం అంటున్నారు. సినిమా ట్రిక్ ఉద్య‌మం లాగా చేస్తారు. మ‌ధ్య‌లోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో... ఎప్పుడు కాడి వ‌దిలేసి మ‌ధ్య‌లోనే వెళ్ళిపోతారో.. ఎప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారో.. ఎప్పుడు తెర‌మీద‌కు వ‌స్తారో ఆయ‌న‌కే తెలియాలి. ఇప్పుడు సినిమా - రాజ‌కీయం రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ద‌మ‌య్యార‌ని అర్థ‌మ‌వుతుంది. వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో ? ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే తెలియాలి.