Begin typing your search above and press return to search.

నాలా తెలంగాణ‌లో తిర‌గ‌గ‌ల‌రా?:ప‌వ‌న్

By:  Tupaki Desk   |   8 July 2018 10:07 AM GMT
నాలా తెలంగాణ‌లో తిర‌గ‌గ‌ల‌రా?:ప‌వ‌న్
X
నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ అంట‌కాగిన సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌లంతా ఎదురు చూస్తున్న సంద‌ర్భంలో....కేంద్రం విసిరేసిన ప్యాకేజీని సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌హా ప్ర‌సాదం లా స్వీక‌రించారు. అంతేకాకుండా...ప్యాకేజీ ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌గా త‌న ఎంపీల‌ను ఢిల్లీకి పంపి...ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌ను శాలువా క‌ప్పి మ‌రీ స‌న్మానించారు. ఇపుడు...ఒకేసారి యూట‌ర్న్ తీసుకొని...టీడీపీ నేత‌లంతా హోదాపేరుతో డ్రామా దీక్ష‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా హోదాపై టీడీపీ వైఖ‌రిని విమ‌ర్శిస్తూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ ట్వీట్ చేశారు. త‌న‌న‌పు స‌న్మానిస్తున్న టీడీపీ ఎంపీలకు వెంక‌య్య ధ‌న్య‌వాదాలు తెలుపుతోన్న ఫొటోను ప‌వ‌న్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై గతంలో టీడీపీ వైఖ‌రి ఇద‌ని, దానిని తమకు అనుకూలంగా మలుచుకోవడం టీడీపీ మరిచిపోయింద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

మ‌రోవైపు, విశాఖ‌లోని ఆర్కే బీచ్ లో నిన్న జ‌నసేన నిర్వ‌హించిన కవాతుకు యువత భారీ సంఖ్య‌లో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఉద్వేగభ‌రితంగా ప్ర‌సంగించారు. చంద్ర‌బాబుపై ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. ఆయ‌న దోపిడీకి వ్య‌తిరేకంగా పోరాడతాన‌న్నారు. తాను నీతివంత‌మైన రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని - అవినీతికి - దోపిడీకి పాల్ప‌డ‌లేద‌ని అన్నారు. అందుకే తాను ధైర్యంగా ఏపీ- తెలంగాణ‌ల‌లో తిర‌గ‌గ‌ల‌న‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ఏప‌క‌ప ఆంధ్రా నాయకుల్లో ఒక్కరైనా తనలా తెలంగాణలో తిరగగలరా అని పవన్ ప్ర‌శ్నించారు. తాను తెలంగాణలో దోపిడీకి పాల్పడలేదని, తెలంగాణను గుండెల్లో పెట్టుకున్నానని ప‌వ‌న్ అన్నారు. ఇపుడు ఆంధ్రా నాయకులు ఒక్క‌రైనా తెలంగాణ‌లో తిరగగలరా అని ప్రశ్నించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను జనసేన శతఘ్ని....త‌న అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది.