Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుపై రెండ్రోజుల్లో స్పందిస్తా- పవన్‌ కళ్యాణ్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 7:13 AM GMT
ఓటుకు నోటుపై రెండ్రోజుల్లో స్పందిస్తా- పవన్‌ కళ్యాణ్‌
X
పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ మాట్లాడాడు. ఈసారి ఇంకొంచెం క్లియర్‌గా తన ఉద్దేశాల్ని వివరించాడు. దాదాపు నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని కుదిపేస్తున్న ఓటుకు నోటు కేసు గురించి తన ట్విట్టర్‌ అకౌంట్లో ప్రస్తావించాడు పవన్‌. ఐతే నేరుగా ఆ అంశం గురించి స్పందించలేదు. మరో రెండు రోజుల్లో ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌ 8 అంశాల గురించి తన అభిప్రాయాలు వెల్లడిస్తానన్నాడు. అవసరమైతే దీనిపై ప్రెస్‌ మీట్‌ కూడా పెడతానన్నాడు. మొన్న నెల్సన్‌ మండేలా స్ఫూర్తి గురించి మాట్లాడిన పవన్‌.. మరోసారి రాజకీయ నాయకులు, పాలకులకు హితవు చెప్పే ప్రయత్నం చేశాడు.

పవన్‌ తాజాగా చేసిన ట్వీట్లు

''ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌ 8 అంశాల గురించి నా అభిప్రాయాల్ని, మరో రెండు రోజుల్లో తెలియజేస్తా''

''అవసరమైతే ఈ వారాంతంలో కానీ వచ్చే వారం మొదట్లో కాని ప్రెస్‌ మీట్‌ కూడా పెడతా''

''ఏదైనా పాలకుడి ఆలోచనల్ని బట్టే ఆధారపడి ఉంటుందని పెద్దవాళ్లు అంటుంటారు. మరి మన నేతల ఆలోచనలు భవిష్యత్తుల్లో మనల్ని ఎటువైపు నడిపిస్తాయో చూద్దాం''

''తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అంటారు. అలాగే పాలకులు బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలను నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి''