Begin typing your search above and press return to search.

టీడీపీపై ప‌వ‌న్ దాడి కంటిన్యూస్‌!

By:  Tupaki Desk   |   16 March 2018 9:09 AM GMT
టీడీపీపై ప‌వ‌న్ దాడి కంటిన్యూస్‌!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఏపీలో అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ ప్ర‌భుత్వం - ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పాల‌న‌పై విమ‌ర్శ‌ల డోస్‌ను మ‌రింత‌గా పెంచేశార‌నే చెప్పాలి. మొన్న‌టిదాకా టీడీపీకి మిత్రప‌క్షంగానే కొన‌సాగిన ప‌వ‌న్‌... మొన్న‌టి పార్టీ ఆవిర్భావ స‌భా వేదిక‌గా ఒక్క‌సారిగా త‌న వాణిని మార్చేశారు. ఎప్పుడూ లేనిది టీడీపీపైనా, నేరుగా చంద్ర‌బాబు ఫ్యామిలీపైనా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్‌... ఇక‌పై టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా కాకుండా టీడీపీ చేసే ప్ర‌తి త‌ప్పును ప్ర‌శ్నించే ప‌క్షంగా కొన‌సాగుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించేశారు. ఏమాత్రం ముంద‌స్తు సూచ‌న‌లు లేకుండానే హఠాత్తుగా ప‌వ‌న్ త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన తీరుపై టీడీపీ షాక్ తిన్న‌ద‌నే చెప్పాలి. అయినా కూడా ప‌వ‌న్‌పై ఎదురు దాడిని పెంచేసేందుకు ఏమాత్రం అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఏదో నోటికి వ‌చ్చిన‌ట్టుగానే ప‌వ‌న్ ఆరోప‌ణ‌లకు కౌంట‌ర్లు ఇస్తున్న టీడీపీ... అస‌లు ప‌వ‌న్‌ను ఎదుర్కోవ‌డ‌మెలా అన్న అంశంపై డైల‌మాలోనే ప‌డిపోయింద‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే... మొన్న పార్టీ ఆవిర్భావ స‌భ వేదిక నుంచి తూటాల్లాంటి మాట‌ల‌ను వ‌దిలిన ప‌వ‌న్‌... తాజాగా గుంటూరు న‌డిబొడ్డున నిలిచి బాబు పాల‌న‌పై త‌న‌దైన శైలి వార్‌ను కంటిన్యూ చేశారు. గుంటూరులో క‌లుషిత జ‌లాల కార‌ణంగా అతిసారం ప్ర‌బ‌లిన సంగ‌తి తెలిసిందే క‌దా. అతిసారం కార‌ణంగా గుంటూరులో ఇప్ప‌టిదాకా 14 మంది చ‌నిపోగా... గుంటూరులోని ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ఇంకా ప‌దుల సంఖ్య‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విష‌యంపై స‌మ‌గ్ర వివ‌రాలు సేక‌రించిన ప‌వ‌న్‌... కాసేప‌టి క్రితం గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రిని సంద‌ర్శించారు. అక్క‌డి రోగుల‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్‌... అతిసారం ప్ర‌బ‌లిన కార‌ణాల‌పై ఆరా తీశారు. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలోనే మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌... చంద్ర‌బాబు స‌ర్కారుపై ఆరోప‌ణ‌లను కొన‌సాగించారు. గుంటూరులో ప్ర‌భుత్వ యంత్రాంగం వైఫ‌ల్యం కార‌ణంగా ఇప్ప‌టికే చాలా మంది చ‌నిపోయార‌ని, వారంద‌నికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌డంతో పాటుగా న‌గ‌రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

అయినా గుంటూరులో అతిసారం ప్ర‌బ‌ల‌డానికి కార‌కులెవ‌రంటూ ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఇలాగే ఏ మంత్రి ఇంట్లోనో, ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో, ఏ బ్యూరో క్రాట్ ఇంట్లోనో జరిగితే సైలెంట్ గా ఉంటారా? అంటూ మండిపడిన పవన్... ఇలాంటి వారికి జర్నలిస్ట్ లు కూడా అండగా నిలవాలని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా వ్యవస్థను నాశనం చేసేశారని ఆరోపించిన ప‌వ‌న్‌... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంద‌ని కూడా ప‌వ‌న్ మండిప‌డ్డారు. గుంటూరులో తాగు నీరు, డ్రైనేజీ మ‌ర‌మ్మ‌తుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా రూ.908 కోట్లను విడుదల చేసిందన్న ప‌వ‌న్‌... ఆ నిధుల‌ను ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మొత్తంగా నిధులను చంద్ర‌బాబు స‌ర్కారు ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేస్తోంద‌ని ప‌వ‌న్ ప‌రోక్షంగా ఆరోపించారు.