Begin typing your search above and press return to search.

జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల నియామకం

By:  Tupaki Desk   |   24 Feb 2020 1:39 PM GMT
జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల నియామకం
X
ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ - మరోవైపు సినిమాల్లో నటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేనాని - వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే అడుగులు వేస్తున్నారు. ఆయన సోమవారం సంయుక్త - పార్లమెంటరీ కమిటీలను నియమించారు. ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రాంతాలవారీగా మొత్తం ఐదు కమిటీలను నియమించారు.

ఉత్తరాంధ్ర - గోదావరి - సెంట్రల్ ఆంధ్ర - రాయల దక్షిణ కోస్తా - రాయలసీమ సంయుక్త కమిటీలలో పార్టీ సీనియర్లను సభ్యులుగా చేరుస్తూ సంయుక్త పార్లమెంటరీ కమిటీల పేరుతో అయిదు కమిటీలను ఖరారు చేశారు. ప్రస్తుతం నియమించిన కమిటీలు బీజేపీ స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకుంటూ రెండు పార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల నిర్వహణ - పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాలను జిల్లా - మండల - పట్టణ - గ్రామస్థాయి వరకు అమలు అయ్యేలా చూడటం - కమిటీ పరిధిలో ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారం - పార్టీని క్షేత్రస్థాయి వరకు పటిష్టం చేయడం లక్ష్యాలుగా పని చేస్తాయి.

ఉత్తరాంధ్ర కమిటీ

శ్రీకాకుళం - విజయనగరం - అరకు - విశాఖపట్టణం - అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వినర్‌ గా సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి) - జాయింట్ కన్వీనర్‌ గా గడసాల అప్పారావు (గాజువాక) - సభ్యులుగా పరుచూరి భాస్కర రావు (అనకాపల్లి) - పేడాడ రామ్మోహన్ (ఆమదాలవలస) - డాక్టర్ బొడ్డేపల్లి రఘు (విశాఖపట్నం)గా ఉంటారు.

గోదావరి సంయుక్త కమిటీ

కాకినాడ - అమలాపురం - రాజమహేంద్రవరం - నరసాపురం - ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు గోదావరి సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వినర్‌ గా మేడా గురుదత్ (రాజమహేంద్రవరం) శెట్టిబత్తుల రాజబాబు (అమలాపురం) జాయింట్ కన్వీనర్‌ గా - సభ్యులుగా వేగుళ్ల లీలాకృష్ణ (మండపేట) - బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) - యిర్రంకి సూర్యారావు (భీమవరం) - గుణ్ణం నాగబాబు (పాలకొల్లు) ఉంటారు.

సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ

విజయవాడ - మచిలీపట్నం - గుంటూరు - నరసరావుపేట - బాపట్ల పార్లమెంట్ స్థానాలకు సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వినర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె. - గుంటూరు) - జాయింట్ కన్వినర్‌ గా సయ్యద్ జిలానీ (నరసరావుపేట) - సభ్యులుగా పోతిన వెంకట మహేష్ (విజయవాడ) - అమ్మిశెట్టి వాసు (విజయవాడ) - గాదె వెంకటేశ్వరరావు (గుంటూరు) - పాకనాటి రమాదేవి (గుంటూరు) ఉంటారు.

రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ

తిరుపతి - చిత్తూరు - రాజంపేట - నెల్లూరు - ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వినర్‌ గా డా.పసుపులేటి హరిప్రసాద్ - షేక్ రియాజ్ జాయింట్ కన్వినర్‌ గా - సభ్యులుగా డా.పొన్ను యుగంధర్ (గంగాధర నెల్లూరు) - సయ్యద్ ముకరం చాంద్ (రాజంపేట) - యగవింటి (మైఫోర్స్) మహేష్ (మదనపల్లి) - మాసి కృష్ణమూర్తి (తిరుపతి) - ఆరేటి కవిత (చిత్తూరు) - శ్రీ గానుగపెంట శ్రీకాంత్ (నెల్లూరు) ఉంటారు.

రాయలసీమ సంయుక్త కమిటీ

అనంతపురం - హిందూపురం - కర్నూలు - నంద్యాల - కడప పార్లమెంట్ నియోజకవర్గాలకు రాయలసీమ సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వినర్‌ గా టి.సి.వరుణ్ (అనంతపురం) - సుంకర శ్రీనివాస్ (కడప) జాయింట్ కన్వీనర్‌ గా - సభ్యులుగా చింతా సురేష్ (కర్నూలు) - రేఖ గౌడ్ (ఎమ్మిగనూరు) - ఆకుల ఉమేష్ (హిందూపురం) - మలిశెట్టి వెంకటరమణ (కడప) ఉంటారు.