Begin typing your search above and press return to search.

బాబుకు మిత్రులే శ‌త్రువులు

By:  Tupaki Desk   |   13 April 2016 11:03 AM GMT
బాబుకు మిత్రులే శ‌త్రువులు
X
జీవితంలో ప్ర‌తిఒక్క‌రికీ శ‌త్రువులు - మిత్రులు ఉంటారు. అయితే శ‌త్రువులు మిత్రులుగా మారొచ్చు కానీ శ‌త్రువులు మారితే చాలా ప్రమాదం. `నా వాళ్లుకున్న‌వాళ్లు ఒక్కొక్క‌రు హ్యాండ్ ఇస్తున్నారు.. ఆప‌ద‌లో ఆదుకున్న వాళ్లు ఇప్పుడు నెమ్మ‌దిగా సైడ్ అయిపోతున్నారు.` ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబును చూసి కొంద‌రు అనుకుంటున్న మాట. అవును చంద్ర‌బాబు న‌మ్మిన ఇద్ద‌రు వ్య‌క్తులు ఇప్పుడు ఆయ‌న‌కు సాయం చేసేందుకు ముందుకు రావ‌డం లేదు! ఆ ఇద్ద‌రు వ్య‌క్తులే ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.

ప‌దేళ్ల త‌ర్వాత చంద్ర‌బాబు అధికార పీఠాన్ని సొంతం చేసుకున్నారంటే అందుకు ఇద్ద‌రు వ్య‌క్తులు కార‌ణం! కానీ వాళ్లే ఇప్పుడు అధికారాన్ని దూరం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. విభ‌జ‌న త‌ర్వాత ఆర్థికంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని గ‌ట్టెక్కిస్తామ‌ని హామీ ఇచ్చారు ప్ర‌ధాని మోడీ. ఇది ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మారు. చంద్ర‌బాబును గెలిపించారు. అలాగే కాపు సామాజిక‌వ‌ర్గపు ఓట్లు టీడీపీకి ప‌డ‌టంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర పోషించారు. అయితే కాలం మారిపోయింది. ఆ మాట‌లు నీటి మూట‌లుగా మిగిలిపోయాయి. చంద్ర‌బాబు ఏ ఒక్క ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఓకే అన‌డంలేదు. దీంతోపాటు రాష్ట్ర బీజేపీ నేత‌ల‌తో నిత్యం గొడ‌వ‌ల‌తోనే కాలం గ‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీ - తెలంగాణ‌లో సొంతంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోన్న బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం కూడా బాబుతో అంటీముట్ట‌న‌ట్టుగానే ఉంటోంది. ఇక మోడీ కూడా బాబును పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం కాని...ఏపీకి నిధులు విద‌ల్చ‌డం కాని చేయ‌ట్లేదు.

అలాగే బాబుకు సంక‌ట స‌మ‌యంలో ప్రెస్‌ మీట్ల‌తోనూ ఆదుకునేవాడు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. అయితే 2019లో తాను ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని ప‌వ‌న్‌ ప్ర‌క‌టించేశాడు. దీంతో మ‌రో మిత్రుడు బాబుకు దూర‌మైపోయాడు. బీజేపీతో బంధం నేడో రేపో తెగేట్టు ఉంది. ప‌వ‌న్ ఒంట‌రి పోరే త‌న‌ద‌ని, అధికారం కోసం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్ట‌డం స‌బ‌బు కాద‌ని ప్ర‌క‌టించి చంద్ర‌బాబుతో క‌టీఫ్ చెప్ప‌క‌నే చెప్పేశాడు. బాబు ప్ర‌భుత్వంపై ఎప్పుడు దాడి చేద్దామా అని వైకాపా అధినేత జ‌గ‌న్ ఎదురుచూస్తున్నారు. ఇక మిత్ర ప‌క్షం శ‌త్రుప‌క్షంగా మారిపోయింది. అటు శ‌త్రుప‌క్షం దాడికి సిద్ధంగా ఉంటోంది. మ‌రి ఇటువంటి ప‌రిస్థితుల్లో బాబు ఎలా గ‌ట్టెక్కుతారో ఏమో!!