Begin typing your search above and press return to search.
పవన్ అనంత టూర్ షెడ్యూల్ రిలీజ్
By: Tupaki Desk | 26 Jan 2018 11:20 AM GMTఅనుకున్నట్లే జరిగింది. అంచనా నిజమైంది. తనకున్న పార్ట్ టైం పొలిటీషియన్ పేరును పొగొట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుం బిగించినట్లుగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మూడు.. నాలుగు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. రెండు రోజుల వ్యవధి తీసుకొని ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకోవటమే కాదు.. ఆ వివరాల్ని మీడియాకు విడుదల చేశారు.
అనంత జిల్లాలో కరువు యాత్ర పేరుతో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. జిల్లాల్లో కరువుపై అధ్యయనం చేయటంతో పాటు.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం కానీ రాత్రి కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరే పవన్.. శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా గుంతకల్ కు చేరుకోనున్నారు.
గుత్తిలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సీమ కరువుకు పరిష్కార మార్గాలనే అంశంపై రైతులు.. వ్యవసాయ.. నీటిపారుదల నిపుణులతో చర్చలు జరుపుతారు. అనంతరం పార్టీ వర్గాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఇక.. ఆదివారం (జనవరి 28) షెడ్యూల్ చూస్తే..
కదిరిలో పర్యటించే పవన్.. తొలుత నర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడతారు. అనంతరం పుట్టపర్తికి ప్రయాణమవుతారు. హనుమాన్ జంక్షన్లో ఏర్పాటు చేసే సభలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అదే రోజు సాయంత్రం.. పుట్టపర్తికి చేరుకొని సత్యసాయి మందిరం.. మంచినీటి పథకం.. ఆసుపత్రిని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
సోమవారం (జనవరి 29) షెడ్యూల్
ధర్మవరానికి వెళ్లే పవన్ అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడతారు. అనంతరం హిందూపురం వెళతారు. జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం చిక్బళ్లాపూర్ కు వెళ్లనున్నారు. అక్కడ సీవీవీ ఇనిస్టిట్యూట్ ను సందర్శించి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. మొత్తానికి వరుస పర్యటనలతో పవన్ బిజీబిజీ అవుతున్నట్లే.