Begin typing your search above and press return to search.

'క‌న‌క‌దుర్గ అమ్మవారి' దీక్షలో ప‌వ‌న్!

By:  Tupaki Desk   |   8 Oct 2018 2:15 PM GMT
క‌న‌క‌దుర్గ అమ్మవారి దీక్షలో ప‌వ‌న్!
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కొంచెం ఆధ్యాత్మిక భావ‌న‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఏడాది చాతుర్మాస దీక్షను ప‌వ‌న్ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేసేవారు. ఆ క్ర‌మంలోనే ఈ సారి దసరా నవరాత్రుల నేపథ్యంలో ప‌వ‌న్ అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. దేవీ నవరాత్రుల సంద‌ర్భంగా ఈ నెల 10వ తేదీ ఉదయం క‌న‌క‌దుర్గా అమ్మ‌వారి పూజ చేసిన అనంతరం ప‌వ‌న్ దీక్షను స్వీకరించనున్న‌ట్లు జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి. ప‌వ‌న్ ఈ దీక్ష‌లో ఈ దీక్షలో ప‌వ‌న్ తొమ్మిది రోజులపాటు ఉండ‌బోతున్నారు. ఆ 9 రోజులు కేవలం పండ్లు - పాలను మాత్రమే ఆహారంగా స్వీకరించ‌బోతున్నారు. విజ‌య ద‌శ‌మి నాడు ప‌వ‌న్ దీక్ష‌ను విర‌మించ‌బోతున్నారు. పోలవరంలో నేడు పార్టీ నాయకులతో సమావేశమైన ప‌వ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ సంవ‌త్స‌రం తాను 9 రోజుల పాటు దుర్గా దీక్ష చేప‌ట్ట‌బోతున్నాన‌ని ప‌వ‌న్ అన్నారు. అవినీతి ర‌హిత రాష్ట్రం కావాల‌ని, స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌భుత్వం రావాల‌ని అమ్మ‌వారిని కోరతాన‌న‌ని ప‌వ‌న్ అన్నారు. అయితే, దుర్గా దీక్ష సంద‌ర్భంగా త‌న పోరాట యాత్ర‌కు ప‌వ‌న్ విరామం ప్ర‌క‌టించ‌డం లేద‌ని తెలుస్తోంది. త‌న పోరాట యాత్ర‌ను కొన‌సాగిస్తూనే....రాజ‌మండ్రి బ్రిడ్జి - ధ‌వ‌ళేశ్వ‌రంలో ప‌వ‌న్ భారీ స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. త‌న సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు అధికంగా ఉన్న తూర్పు - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ప‌వ‌న్ పాగా వేయాల‌ని చూస్తున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను చూసి టీడీపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ఉభ‌య గోదావ‌రి జిల్లాల ఓట‌ర్ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకునేందుకు ప‌వ‌న్ గట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, ప‌వ‌న్ పోరాట దీక్ష‌ - అమ్మ‌వారి దీక్ష‌..ప‌వ‌న్ కు అధికారం క‌ట్ట‌బెడ‌తాయో లేదో తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.