Begin typing your search above and press return to search.

నాదెండ్ల... నా గుండె... పవన్ మార్క్ వార్నింగ్

By:  Tupaki Desk   |   13 May 2023 8:00 AM GMT
నాదెండ్ల... నా గుండె... పవన్ మార్క్ వార్నింగ్
X
నాదెండ్ల మనోహర్. జనసేనలో పవన్ తరువాత అంతటి నాయకుడు. పవన్ కంటే ఎక్కువగా జనంలో కనిపించే నేత. నాదెండ్ల గురించి గతంలో చాలా మీటింగులలో పవన్ బాగా చెబుతూ ఉండేవారు. కానీ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో శుక్రవారం జరిగిన మీటింగులో మాత్రం ప్రత్యేకంగా ఒక పావుగంటకు పైగా నాదెండ్ల గురించే చెబుతూ ఆయన్ని ఏమైనా అంటే అంటూ సొంత పార్టీ వారికే వార్నింగ్ ఇచ్చేశారు.

అసలు అలా ఎందుకు చేశారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే చాలానే ఉంది మ్యాటర్. పవన్ కంటే నాదెండ్ల ఎక్కువగా తిరుగుతారు. జనంలో కనిపిస్తారు. ప్రకటనలు ఇస్తారు. ఆయన సామాజికవర్గం నేపధ్యం. ఆయన మీద అనుమానాలు కలిగేలా చేసేలా చేస్తున్నాయని అంటున్నారు.

అంతే కాదు పార్టీని వీడి వెళ్ళిన ప్రతీ వారూ నాదెండ్ల మీదనే ఒక బండ వేసి పోతున్నారు. దీంతో నాదెండ్ల ఏదో చేస్తున్నారు అన్న అనుమానాలు అయితే కలిగేలా చేసారు. దీంతో జనసేనలోనే కొందరు నేతలు అయితే నాదెండ్ల మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చేస్తూ వస్తున్న అనేక కామెంట్స్ పవన్ చెవిన పడ్డాయని తెలిసింది.

దాంతో ఆన పార్టీ మీటింగులో గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ ఉన్నతుడు. ఆయన ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేశారు. అనుభవశాలి. ఆయన ఒక ముఖ్యమంత్రి గా పనిచేసిన నాయకుడి
కుమారుడు. పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో పనిచేఅస్తున్నారు అని కీర్తించారు

ఆయనకు మన పార్టీలో ఏమిచ్చాం, బంగారలు ఏమైనా ఇచ్చామా. మనతో పాటు వచ్చి ఓటమిని కొని తెచ్చుకున్నారు. అయినా సరే కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలంటి వారి మీద ఆరోపణలా అని మండిపడ్డారు. నాదెండ్ల పాపం ఇవన్నీ వింతూ తింటూ పాపాల భైరవుడిగా భరిస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాదెండ్ల ఏ విషయం మాట్లాడినా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగే మాట్లాడుతారు. ఆయన సొంతంగా ఏదీ నిర్ణయం తీసుకోరు. అలాంటి నాయకుడి మీద ఆరోపణలు సొంత పార్టీ వారు చేసినా వారు నాకు అనుకూల శత్రువులు అనుకుంటాను, అంతే కాదు వైసీపీ కోవర్టులు అనుకుంటాను. వారి విషయంలో ఇక మీదట సహించేది లేదు, భరించేది అంతకంటే లేదు. అలాంటి వారు పార్టీకి అవసరం లేదు అని పవన్ కుండబద్ధలు కొట్టారు.

పార్టీలో ఉంటే పార్టీ పెద్దలను గౌరవైంచాలి. మహిళలను గౌరవించాలి. అందరితో మంచిగా ఉండాలి ఇదే నా విధానం అని పవన్ పేర్కొన్నారు. జనసేన పేరుతో ఎవరినీ బెదిరించవద్దు, బ్లాక్ మెయిల్ చేయవద్దు అని సూచించారు. నాదాకా ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటివి ఏమున్నా ఆపేయాలి. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక జనసేనలో పదవులు కావాలంటే కష్టపడి పనిచేయాలని, అంతే తప్ప ఇవాల వచ్చి రేపు వెళ్లిపోయే వారు తనకు అవసరం లేదని, వారు నిరభ్యంతరంగా పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు అని పవన్ తేల్చి చెప్పేశారు. మొత్తానికి తొలిసారిగా పార్టీ వేదికల మీద ఆయన సొంత పార్టీలో కొందరి వైఖరి మీద మండిపడ్డారు. తన మీద కోపం పెట్టుకుని నాదెండ్లను అంటే అసలు ఊరుకోను ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిందే అని క్లారిటీ ఇచ్చేశారు. మరి నాదెండ్ల మీద విమర్శలు ఇకనైనా ఆగుతాయా. చూడాల్సి ఉంది.