Begin typing your search above and press return to search.
సీఎం పదవికి సిద్ధం.. పిఠాపురంలో పవన్ ఇంకేం చెప్పారు?
By: Tupaki Desk | 17 Jun 2023 10:05 AM GMTపదవి కంటే ప్రజలే ముఖ్యమని చెప్పే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం రేసులోకి వచ్చేశారు. గతానికి భిన్నంగా తాజాగా ఆయన పిఠాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పేశారు. ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పిన ఆయన జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సమాజంలో గొడవలు జరగాలన్నదే వైసీపీ ఆలోచన అన్నట్లు మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో శాంతిభద్రతల్ని నిర్వీర్యం చేశారని.. గంజాయిని రాష్ట్రానికి కేరాఫ్ అడ్రస్ గా చేశారన్న పవన్.. పిఠాపురం బహిరంగ సభలో చేసిన ప్రసంగంలోని కీలక అంశాల్నిచూస్తే..
- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నా.
- దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం నుంచి అర్ధిస్తున్నా. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నా. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతా.
- ఈ రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్. పిఠాపురం రాగానే నాకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయి. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయి. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన దాగుంది. వైసీపీ నాయకుల కుట్ర దాగుంది.
- వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి. దాని ద్వారా వారితో గొడవ పడాలి. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి బోలెడు లాభం పొందాలనే చచ్చు ప్రభుత్వం ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయి.
- సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టం. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారు.
- పిఠాపురంలో మొదట హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తే నిందితుడిని పిచ్చివాడు అని చెప్పారు. మరి 219 దాడులు, విగ్రహాల ధ్వంసం కూడా పిచ్చివాళ్ల పనేనా..? శ్రీరాముడి విగ్రహం తల నరికింది కూడా పిచ్చివాడేనా? ఎందుకు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయలేదు అంటే వైసీపీ దగ్గర సమాధానం ఉండదు.
- వైసీపీ అనే దుష్ట ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తె ఎవరినీ బతకనివ్వరు. ప్రతి ఇంట్లోకి వైసీపీ గుండాలు వచ్చి దోచుకుంటారు. హంతకులు.. గుండాలు.. రౌడీలు.. అవినీతి పరులతో వైసీపీ ప్రభుత్వం నిండిపోయింది. వైసీపీ పార్టీ గుండాలకు నిలయం.
- నేర పూరిత రాజకీయాలంటే నాకు చాలా చిరాకు. జనసేన ప్రభుత్వంలో నేర చరితులకు స్థానం ఉండదు. ప్రతి వైసీపీ గూండాగాళ్లను బట్టలు ఊడదీసి నడి రోడ్డుపై ప్రజలతో కొట్టించే రోజు దగ్గర్లోనే ఉంది. క్రిమినల్ మైండ్ ఉన్న వారు పాలిస్తే క్రిమినల్స్ కు వత్తాసు పలకకుండా ఏం చేస్తారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బయటకు వెళ్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయం అందరిలోనూ ఉంది.
- సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయిదంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. తుని దగ్గర వైసీపీ నాయకుడి అనుచరుడు భూమి కబ్జా చేశాడని ఓ ఆడబిడ్డ ఫిర్యాదు చేస్తే, ఆమెకు మానసికంగా బాగాలేదని కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు.
- కరోనా సమయంలో మాస్కులు లేవు అని చెప్పిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడు అని ముద్ర వేసి, చనిపోయేలా చేశారు. ఓ నాయకుడు గూండాలతో బెదిరిస్తే, మరో వైసీపీ నాయకుడు బహిరంగంగా గన్ తో తిరుగుతాడు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలోనే జరుగుతున్న తంతు.
- జనసేన ప్రభుత్వంలో ‘‘సురక్ష ఆంధ్రప్రదేశ్’’ ను సాధించి తీరుతాం. అన్నీ వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా జనసేన బాధ్యత తీసుకుంటుంది. శాంతి భద్రతల పరిరక్షణను జనసేన ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్య అంశంగా చేస్తాం. పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించేలా చూస్తాం.
- గత నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేశారు. పోలీసుశాఖను నిర్వీర్యం చేశారు. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టం... వేసిందే శిక్ష అన్నట్లు పరిస్థితి తయారైంది. సున్నితమైన అంశాల్లో సైతం పోలీసులు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు.
- రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి దేశ రాజధానిగా వైసీపీ మార్చింది. రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయి దేశంలోనే అధికం. మన్యంలో విపరీతంగా గంజాయి పడుతుంటే, దాన్ని రవాణా చేసి లాభపడుతోంది వైసీపీ నాయకులు. రాష్ట్రంలో గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలి.
- సాగునీటి రంగానికి బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించారు. పిఠాపురం ప్రాంతానికి సాగునీరు అందించే ఏలేరు రిజర్వాయర్ నిధులేవీ కేటాయించలేదు.పనులు చేయమంటే రివర్స్ టెండరింగ్ అంటూ నాటకాలు ఆడటం తప్ప, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. పిఠాపురం చుట్టపక్కల నుంచి అక్రమంగా మట్టిని రోజూ తవ్వుతున్నారు. రోజుకు 300 లారీల మట్టిని అమ్ముకుంటున్నారు. అంటే రోజుకు రూ.2 కోట్లను దోచేస్తున్నారు. ఈ సొమ్ము వైసీపీ నాయకుల జేబుల్లోకే వెళ్తోంది.
- అధికారంలోకి రాగానే ప్రతి ఏడాది జనవరిలో యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దాదాపు 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేకపోయారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మంది యువతను ఎంపిక చేసి, వారు వ్యాపారం పెట్టుకునేలా రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం చేస్తాం.
- అంతే తప్ప రూ. 5 వేలు, రూ.3 వేలు జీతాలకు చాకిరి చేసేలా చేయం. దీనికి ఏటా రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనా. వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏటా రూ.10 వేల కోట్లు సంపాదిస్తున్నారు.
- ఈ సీఎం ఎన్నికల ముందు అన్నట్లు నన్ను ముఖ్యమంత్రిని చేయండి.. అది చేసేస్తా.. అన్నీ ఇచ్చేస్తా... అని చెప్పను. నేను చేసేది మాత్రమే అన్నీ ఆలోచించి చెప్తాను. మాట ఇచ్చిన తర్వాత తల తెగినా దానికి కట్టుబడి ఉంటాను.
- సినిమాలు వేరు.. రాజకీయం వేరు. నాకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోలు ఇష్టమే. అందరి అభిమానులు ఆలోచించి ఓట్లు వేయండి. నేను ఒక్క సినిమా చేస్తే దాదాపు 500 మందికి ఉపాధి లభిస్తుంది. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలు చేయబట్టే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోగలిగాను. సంపద సృష్టించాను కాబట్టే పంచగలిగాను.
- పాపం పసివాడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. బాబాయిని చంపేసి ఆ రక్తం తుడుచుకొని వచ్చి మళ్లీ నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాడు. సీబీఐ అధికారులు వీళ్లు మీద ఆధారాలతో నిందారోపణలు చేస్తుంటే ... వీళ్లు మాత్రం సొంత చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత మీద నిందారోపణలు చేస్తున్నారు.
- సొంత తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? మనం క్రిమినల్స్ ను ఎన్నుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. నేను బతికున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద క్రిమినల్స్ కూర్చొవడానికి ఇష్టపడను. అలా జరగకుండా నా వంతు పోరాటం చేస్తాను. వైసీపీ నాయకులు అప్పులు తెచ్చి, ట్యాక్సులు పెంచి అభివృద్ధి అంటున్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, లారీలపై హరిత పన్ను, భవనాల నిర్మాణాలపై పన్ను ఇలా పెంచుకుంటూ పోతూ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు.
- వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి దోచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా? కాదా అని చూడకుండా... సమర్ధుడా కాదా అని ఆలోచించి ఓటు వేయండి. సముద్ర కోతతో ఉప్పాడ గ్రామం మూడొంతులు మునిగిపోయింది. దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరించి వాళ్ల పంటలకు గిట్టుబాటు ధరతో పాటు విత్తనాలు సకాలంలో అందేలా చూస్తాం. రాష్ట్రానికి అన్నపూర్ణవంటి గోదావరి జిల్లాల్లో నీళ్లు కలుషితమైపోయాయి. గోదావరి జిల్లాలను కాపాడుకోగలిగితే రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది.