Begin typing your search above and press return to search.
పవన్ కు కొత్త బిరుదిచ్చిన శతఘ్ని!
By: Tupaki Desk | 2 Sep 2018 8:03 AM GMTనేడు జనసేన అధినేత - సినీనటుడు పవన్ కల్యాణ్ 47వ జన్మదినాన్ని ఆయన అభిమానులు - జనసేన కార్యకర్తలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. సహజంగా జన్మదినం సందర్భంగా పవన్ అభిమానులు ఆయనను ఇంద్రుడు...చంద్రుడు....అని పొగడ్తలతో ముంచెత్తడం...కేకులు కోసి కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం కూడా కామన్. అయితే, తాజాగా ఈ బర్త్ డే సందర్భంగా పవన్ కు జనసేన శతఘ్ని టీం ఓ కొత్త బిరుదునిచ్చింది. జనసేనానిని`సోషల్ సైంటిస్ట్`గా అభివర్ణిస్తూ శతఘ్ని టీం పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ అభిమానులు - జనసేన కార్యకర్తలు....ఆ బిరుదును వైరల్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ అభిమానులంతా తమ సోషల్ సైంటిస్ట్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మురిసిపోతున్నారు.
వాస్తవానికి సోషల్ సైంటిస్ట్ అనే బిరుదు, పదం ఇప్పటివరకు ఎవరూ వాడలేదు. అయితే, పవన్ కు ఆ బిరుదు ఎందుకు ఇచ్చామో చెప్పేందుకు శతఘ్ని శతవిధాలా ప్రయత్నించింది. చిన్న పిల్లలతో పవన్ దిగిన ఫొటోలు...పెద్దవాళ్ల కాళ్లు పట్టుకున్న సందర్భంలో తీసిన ఫొటోలు....మురికివాడల్లో మోకాలి దాకా బూట్లు వేసుకుని తిరిగిన వీడియోలు....గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా స్వయంగా మొక్కలు నాటిన ఫొటోలు.. ఇలా....ఒక ఫిలాంత్రోపిస్ట్ గా పవన్ చేసిన పనులను బట్టి ఆయనకు `సోషల్ సైంటిస్ట్`అనే బిరుదిచ్చింది శతఘ్ని. బహుశా గతంలో హార్వర్డ్ లో పవన్ ప్రసంగించిన విషయాన్ని గుర్తుచేసుకున్న శతఘ్ని ....ఆయనను సోషల్ సైంటిస్ట్ గా ఫిక్స్ చేసి ఉంటుంది.
అభిమానుల లెక్క ప్రకారం....పవన్ కు విపరీతంగా సామాజిక స్పృహ ఉందనుకుందాం....ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నాడనుకుందాం....ప్రజాసేవే ఊపిరిగా బ్రతుకుతున్నాడనుకుందాం.....అంతమాత్రానికి సోషల్ సైంటిస్ట్ అయిపోతారా?సరే,...పవన్, జనసేన అభిమానుల అభిమానం కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే....పవన్ కన్నా ఎక్కువగా సమాజం కోసం పరితపించిన వారు...తమ జీవితాలను పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేసిన వారు ఎందరో ఉన్నారు. మరి వారిని ఏమని పిలవాలి? 8 నెలల క్రితం వరకు పార్ట్ టైం పొలిటిషియన్ గా ఉన్న పవన్...ఒక్కసారిగా ఫుల్ టైం పొలిటిషియన్ గా మారే ప్రయత్నం చేసినందుకు ఆయనకు ఈ బిరుదివ్వాలా? తనకు చెప్పిన సమాచారన్ని విని...అవే సమస్యలు అనుకొని ఫిక్సయ్యే మిడిమిడి జ్ఞానం ఉన్నందుకు అలా పిలవాలా?ఆవేశ పూరితంగా...ఉద్వేగంతో ప్రసంగించినందుకు అలా పిలవాలా? పోనీ తాను పూర్తిగా సినిమాలు వదిలేశానని పవన్ ప్రకటిస్తే...ఆ బిరుదుకు జస్టిఫికేషన్ దొరుకుతుందనుకోవచ్చు...కానీ, గత ఎన్నికల్లాగానే...ఈ సారి కూడా రిజల్ట్ తాను అనుకున్నట్లు లేకపోతే చిరంజీవిలాగే పవన్ కూడా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు సినిమాలు చేసుకుంటూ కూర్చోడని గ్యారెంటీ ఉందా? ప‌్రస్తుతానికి పవన్ ...ఓ సీజనల్ పొలిటిషియన్ మాత్రమే. పవన్ ప్రశ్నించగలడు...కానీ, పరిష్కరించలేడు. మరి, ఇంతమాత్రానికి పవన్ ను సోషల్ సైంటిస్ట్ అంటూ పెద్ద పెద్ద బిరుదులివ్వడం ఎంత సమంజసమో ఆయన అభిమానులు ఆలోచించుకోవాలి.