Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ 'విశాఖ మార్చ్‌'కు సిద్ధం.. మ‌రి బీజేపీ క‌లుస్తుందా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 1:30 PM GMT
ప‌వ‌న్ విశాఖ మార్చ్‌కు సిద్ధం.. మ‌రి బీజేపీ క‌లుస్తుందా?
X
ఏపీలో కీల‌క‌మైన పార్టీ జ‌న‌సేన‌తో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తులో ఉన్నామ‌ని.. పొత్తు కొన‌సాగుతోంద‌ని బీజేపీ రాష్ట్ర నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఆది చెప్పుకొన్న సంక‌ల్పం మేర‌కు..చేసుకున్న ఒప్పందం మేర‌కు త‌మ‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేద‌ని, క‌నీసం త‌మ‌ను గుర్తించ‌డం లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు ప‌దే ప‌దే చెబుతున్నారు.

దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఈ ప‌రిణామాల‌తోనే విసుగు చెందిన ప‌వ‌న్‌.. నేరుగా వెళ్లి.. టీడీపీతో పొత్తుకు తెర‌దీశారు. చేతులు క‌లిపారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీంతో ఉలిక్కిప‌డిన రాష్ట్ర బీజేపీ నేత‌లు వెంట‌నే ఢిల్లీ వెళ్లి ప‌వ‌న్‌ను ఢిల్లీకి పిలిచేలా చేశారు. పొత్తు కొన‌సాగేలా చ‌క్రం తిప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, మ‌రి ఇప్ప‌టికైనా బీజేపీ నేత‌లు ప‌వ‌న్‌తో క‌లిసి ఉంటారా? ఆయ‌న వెంట న‌డుస్తారా? త‌మ వెంట తిప్పుకుంటారా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

న‌వంబ‌రు 3న ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ కేంద్రంగా '5 కిలో మీట‌ర్ల మార్చ్‌' నిర్వ‌హిస్తున్నారు వైసీపీ లేవ‌నెత్తిన మూడు రాజ‌ధానులు, ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేయ‌డం వంటివాటి వెనుక ఉన్న విష‌యాన్నితేల్చేయాల‌ని నిర్ణ‌యించారు.

దీనికి సంబంధించి ఈ నెల 30, 31 తేదీల్లో ప‌వ‌న్ కీల‌క స‌మావేశం పెట్టారు. ఈ కార్య‌క్ర‌మం మొత్తం కూడా విశాఖ మార్చ్‌పైనే ఫోక‌స్ పెడ‌తార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మానికైనా క‌లిసి వ‌స్తారా? రారా? అనేది చ‌ర్చనీయాంశంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ తో ఉన్నామ‌ని చెబుతున్న నాయ‌కులు ఒక్కటంటే ఒక్క కార్య‌క్ర‌మానికి కూడా క‌లిసి రాలేద‌నే విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ చేప‌డుతున్న మార్చ్‌కు ఏమేర‌కు క‌లిసి వ‌స్తారో చూడాలి.

ఎంత సేపూ ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారే త‌ప్ప , త‌మ త‌ప్పులు గుర్తించ‌లేక పోవ‌డం బీజేపీకి ప్ర‌ధాన అవ‌రోధంగా మారింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. మ‌రి ఇప్పుడైనా క‌లిసి వ‌స్తే ప‌వ‌న్ అంతో ఇంతో ఖుషీ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. లేక‌పోతే, ఇక‌, ఎవ‌రిదారి వారిదే అని తేల్చడానికి కూడా రెడీ అయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.