Begin typing your search above and press return to search.

పవన్ ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారట...

By:  Tupaki Desk   |   3 Dec 2022 1:30 AM GMT
పవన్ ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారట...
X
ఏపీలో జనసేన గురించి ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ గురించి ఇపుడు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే పార్టీగా జనసేన ఉంది. ఇదిలా ఉండగా పవన్ అధికారికంగా బీజేపీతో మిత్రుడిగా ఉన్నారు. ఈ మధ్యనే మోడీ పవన్ కళ్యాణ్ బీజేపీ బిగ్ షాట్. ప్రధాని నరేంద్ర మోడీతో ఏకాంత భేటీ వేసి తానేంటో రుజువు చేసుకున్నారు.

ఆ తరువాత పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది కూడా అంతా గమనిస్తున్నారు. ఆయన బీజేపీతో కలసి అడుగులు వేస్తున్నట్లేనా లేక టీడీపీని కూడా ఆ కూటమిలోకి తీసుకొస్తారా అన్న సస్పెన్స్ అయితే వీడలేదు. మరో వైపు చూస్తే సోలోగా పవన్ వస్తారని రావాలని జనసేనలో వినిపిస్తున్న మాట.

పవన్ తమకు ప్రియతమ నేస్తమని, ఆయనతోనే తాము ఏపీ రాజకీయాలను తిరగరాయబోతున్నామని బీజేపీ పెద్దలు వీలు కుదిరినపుడల్ల చెబుతారు. అయితే ఆ మాట జనసేన నోట మాత్రం రాకపోవడంతో అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయం ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తో కలసి బీజేపీ 2024 ఎన్నికలను ఫేస్ చేయబోతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోమారు నొక్కి చెప్పారు.

ఏపీలో బీజేపీ జనసేన కూటమిని చూసి ప్రధాన పార్టీలు రెండూ గజగజలాడుతున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో రాజకీయ ముఖ చిత్రాన్ని తమ కాంబో మారుస్తుందని ఆయన చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తు చాలా సౌకర్యవంతంగా ఉందని, ఎక్కడా పొరపొచ్చాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవని, రాబోవని ఆయన స్పష్టం చేసారు.

ఇక పవన్ కళ్యాణ్ తమ పార్టీ పెద్దలతో కీలక నేతలతో తరచూ టచ్ లో ఉంటున్నట్లుగా జీవీఎల్ సరికొత్త సీక్రెట్ ని విప్పి చెప్పారు. అలాగే బీజేపీ ముఖ్యులతో ఆయన తరచుగా సమావేశాలు జరుపుతున్నారని జీవీఎల్ చెప్పడం విశేషం. తమ పొత్తు సక్సెస్ ఫుల్ గా సాగుతోందని, పవన్ తో దోస్తీ బ్రహ్మాండమని కూడా జీవీఎల్ అంటున్నారు.

మరి పవన్ కళ్యాణ్ కలిసే బీజేపీ ముఖ్యులు ఎవరు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. పైగా వారితో పవన్ ఎక్కువగా సమావేశం అవుతున్నారని జీవీల్ చెబుతున్నారు. మరి ఆ మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. పవన్ తో హైదరాబాద్ లో బీజేపీ పెద్దల మీటింగ్ జరిగినా ఆ వార్త క్షణాలలో వైరల్ అయి బయటకు వస్తుంది. మరి అక్కడ కాకుండా ఢిల్లీలో ఈ భేటీలు జరుగుతున్నాయా అన్నది ఇపుడు చూడాల్సి ఉంది.

బీజేపీలో కీలక నేతగా ఉన్న జీవీఎల్ ఈ విషయం చెబుతున్నారు అంటే పవన్ బీజేపీ పెద్దలతో మాట్లాడుతూ తన రాజకీయ అజెండాతో పాటు రోడ్ మ్యాప్ ని కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నట్లుగా అర్ధమవుతోంది అంటున్నారు. ఏది ఏమైనా జనసేన నేతలు బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. ఎంతసేపూ పవన్ మా మిత్రుడు అని బీజేపీ వారే జబ్బలు చరచుకుంటున్నారు. అంతే కాదు పవన్ మీటింగ్స్ అన్నీ ఢిల్లీ స్థాయి పెద్దలతో అనే అంటున్నారు. మరి ఏపీ బీజేపీ జనసేన కలవకపోతే ఈ పొత్తులకు ఫలితం ఏముంటుంది అన్నది కూడా కీలకమైన పాయింట్.

ఏపీలో బీజేపీ నేతలు ఆంత తృప్తి కోసం మేమిద్దరం ఒక్కటి అని చెప్పడం కాదు, అలా జాయింట్ ఫోటో ఒకటి చూపించాలి కదా. అదే విధంగా ఉమ్మడి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుని పోరాడాలి కదా అన్నదే అందరి ప్రశ్న. ఏది ఏమైనా పవన్ మీద కమలం నాయకులకు నమ్మకం ఉంది. మేమే ఏపీలో వైసీపీని ఓడించే జోడీ అని బీజేపీ వారు చెబుతున్నారు. సో దాన్ని ఎంతో కొంత నమ్మాల్సిందే..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.