Begin typing your search above and press return to search.
పవన్ కు ఏమో అయ్యింది
By: Tupaki Desk | 22 Jun 2023 3:00 PM GMTవారాహి యాత్ర మొదలయ్యే సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏమో అయినట్లుంది. అందుకనే ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు. ఒకచోట మాట్లాడిందానికి భిన్నంగా మరోచోట మాట్లాడుతున్నారు.
తాజాగా ముమ్మిడివరం సభలో మాట్లాడుతు తాను ఓడిపోతాన ని తెలిసే పోరాడుతున్నట్లు చెప్పారు. జనాలు తన కు ఓట్లేయకుండా ఓడించినా పర్వాలేదు తాను మాత్రం ఇదే నేల పై పోరాటాలు చేస్తునే ఉంటానన్నారు. నిజానికి ఇలా ఎవరు మాట్లాడరు. చివరకు పంచాయితీకి పోటీ చేసే వార్డు మెంబర్ కూడా పోటీలో గెలుస్తాననే అంటాడు.
పవన్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. మొదటి ఐదురోజులు జనసేన ను అధికారం లోకి తీసుకురమ్మన్నారు. తనను ముఖ్యమంత్రి ని చేయమని పదేపదే అడిగారు. తర్వాత మీడియా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తాను ముఖ్యమంత్రి ని ఎలాగవుతానని ఎదురు ప్రశ్నించారు. ఏదో తన అభిమానులు తనను చూసి సీఎం సీఎం అంటుంటే తాను వాళ్ళకి మద్దతుగా మాట్లాడానంతే అన్నారు. తన టూర్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళు తన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అంచనా వేస్తారనే ఆలోచన కూడా పవన్లో లేనట్లుంది.
కాకినాడ లో ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ని నోటికొచ్చినట్లు తిట్టేశారు. ఎంఎల్ఏ గా ఎలా గెలుస్తావో చూస్తానని చాలెంజ్ చేశారు. ద్వారంపూడి గనుక గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాలు విసిరారు.
ద్వారంపూడి గెలిస్తే పవన్ తన పేరు మార్చుకుంటానని ప్రకటించటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఎంఎల్ఏ ని రోడ్ల పై పరుగెత్తించి, మోకాళ్ళ పై నిలబెట్టి బట్టలూడదీని కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇంత మాట్లాడిన పవన్ చివరలో జనాలు ఓట్లేసి గెలిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు.
ముమ్మడివరంలో మాట్లాడుతూ ద్వారంపూడి అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ధ్వేషం లేదన్నారు. వ్యక్తిగతంగా ధ్వేషం లేకపోతే పరుగెట్టించి కొడతానని, బట్టలూడదీసి మోకాళ్ళ పై నిలబెట్టిస్తానని, ద్వారంపూడి గెలిస్తే తన పేరు మార్చుకుంటానని పవన్ ఎందుకు చెప్పినట్లు ?
ముమ్మిడివరం లో మాట్లాడుతూ తాను ఓడిపోతానని తెలిసే పోరాటం చేస్తున్నానని ఎందుకు చెప్పారో అర్ధంకావటంలేదు. ఎన్నికల్లో ఎవరైనా గెలుస్తామనే పోటీ చేస్తారు కానీ ఓడిపోవటానికి కాదు కదా. ఓడిపోతామని ముందే తెలిస్తే ఎవరైనా పోటీచేస్తారా ? పవనే తాను ఓడిపోతానని చెబితే జనాలు ఓట్లేస్తారా ?