Begin typing your search above and press return to search.
బీజేపీ కండువాను పక్కన పెట్టేయబోతున్న పవన్!?
By: Tupaki Desk | 10 Feb 2021 10:00 PM ISTఏపీ బీజేపీతో అంటకాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న పనులపై ఉడికిపోతున్నారా? ఏపీకి శాపంగా మారుతున్న బీజేపీ నిర్ణయాలను మౌనంగా భరిస్తున్నారా? ఏం చేయలేక తనలో తాను కుమిలిపోతున్నాడా? తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కూడా పవన్ ఆగ్రహంతో ఉన్నారా? అంటే ఔననే సమాధానం రాజకీయవర్గాల్లో వస్తోంది.
పోలవరంకు నిధులు ఇవ్వకుండా.. విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడం.. తిరుపతిలో బీజేపీ పోటీ చేయడం.. ఇన్ డైరెక్టుగా వైసీపీకి సపోర్టుగా బీజేపీ రాజకీయం ఉండడంపై పవన్ ఇప్పటికే ఉడికిపోతున్నారనే ప్రచారం సాగుతోంది.
ఇవే కాదు.. కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా చేస్తున్న బీజేపీ తీరును కూడా పవన్ భరించలేకపోతున్నాడట.. మోడీని కలిసి కడిగేద్దామని.. పాత హామీలు గుర్తు చేద్దామని పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా.. మోడీ అపాయింటే పవన్ కు లభించడం లేదట.. అమిత్ షాను నిన్న కలిసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవట.. ఇవన్నీ చూసిన తర్వాత జనసేనాని పవన్ లోలోపల బీజేపీ తీరును ఏమాత్రం సహించడం లేదట..
జనసేన విస్తరించాలంటే బీజేపీతో విడిపోవడం మంచిది అని కొందరు సలహాలు ఇస్తున్నారట.. వారి సలహాలతో పవన్ లోనూ మార్పు వస్తుందని.. 'చెవిటి వాడి ముందు శంఖం ఊదే బదులు.. బీజేపీకి రాంరాం చెప్పి ఏపీలో సొంతంగా పోరాడడం బెటర్ అని పవన్ ఆలోచిస్తున్నాడట.. బీజేపీ ఇలా ఏపీ వ్యతిరేక నిర్ణయాలతో ముందుకెళితే మాత్రం ఆపార్టీతోపాటు తాను కూడా మునగడం ఖాయమని పవన్ భయపడుతున్నట్టు సమాచారం. మరి పవన్ ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది.