Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్ పై చేతులెత్తేసిన పవన్

By:  Tupaki Desk   |   13 Dec 2021 5:38 AM GMT
వైజాగ్ స్టీల్ పై చేతులెత్తేసిన పవన్
X
అవును ఒకవైపు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా దీక్ష చేసిన పవన్ కల్యాణ్ ఇదే సందర్భంలో తాను ప్రైవేటీకరణను ఆపలేనని పరోక్షంగా చేతులెత్తేశారు.

దీక్ష విరమణ సందర్భంగా పవన్ మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర మంచి పేరుందని పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

అంటే మంచిపేరును చెడగొట్టుకోవటం తనకు ఇష్టం లేదు కాబట్టే మోడీతో గొడవ పెట్టుకోలేనని చెప్పేశారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని అడగటం, చెప్పటం అంటే మోడీతో గొడవ పెట్టుకోవటమే అని పవన్ ఎలాగ అనుకున్నారో అర్ధం కావటంలేదు.

అడగటం, చెప్పటం కూడా పవన్ దృష్టిలో గొడవపెట్టుకోవటమే అయితే ఇక పవన్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చేతులెత్తేసినట్లే అని అర్థమైపోతోంది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని గతంలోనే అమిత్ షా తో చెప్పారట.

స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయితే పవన్ అమిత్ షా ను కలవటంలో ఉపయోగమేముంటుంది ? గతంలో రెండుమూడుసార్లు మోడి, షా అపాయిట్మెంట్ కోసం పవన్ ఢిల్లీలోనే రెండు మూడు రోజులు వెయిట్ చేసి వెనక్కు వచ్చేసిన విషయం అందరికీ తెలుసు.

మోడీ, షా ఇద్దరు అపాయిట్మెంట్ ఇవ్వని కారణంగానే వెనక్కు వచ్చేశారంటేనే వాళ్ళు పవన్ కు ఎంత గౌరవం ఇస్తున్నారో అర్ధమైపోతోంది. స్టీల్ ఫ్యాక్టరీ విషయమే కాదు ఏ విషయంలో అయినా పవన్ చెబితే మోడీ, షా వింటారా ? విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత మార్చేంత సీన్ పవన్ కు లేదని అందరికీ తెలుసు.

స్టీల్ ఫ్యాక్టరీ విషయంపై గతంలో మాట్లాడుతు ప్రభుత్వరంగ సంస్ధలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందని పవనే చెప్పారు. కేంద్రం నిర్ణయం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు చాలా ఫ్యాక్టరీలకు వర్తిస్తుందని కూడా పవన్ స్పష్టంగా చెప్పారు.

అంటే పవన్ కు కూడా బాగా తెలుసు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని. మరి దీక్షలు దేనికంటే అంతా డ్రామాలు మాత్రమే అని అర్ధమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లటానికి దీక్ష వేదికను ఉపయోగించుకున్నారంతే.

ఇంతోటి దానికి దీక్షని, మోడీతో గొడవని సొల్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల వరకు ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యమైతే, ఆ ఎన్నికల్లో ఏదన్నా అద్భుతం జరిగితే మాత్రమే ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం పునరాలోచిస్తుంది. లేకపోతే తన ఫ్యాక్టరీ తనిష్టం అన్న పద్దతిలో ప్రైవేటీకరణ చేసేయటం ఖాయం. జగన్+చంద్రబాబు+పవన్ ఎంత మొత్తుకున్నా జరిగేదిదే. ఎందుకంటే పోరాటాల విషయంలో మన నేతల్లో చిత్తశుద్ది లేదని మోడి, షా కు బాగా తెలుసు కాబట్టే.