Begin typing your search above and press return to search.
జగన్ కి డెడ్ లైన్ పెట్టిన పవన్
By: Tupaki Desk | 26 Jun 2023 9:18 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో దూకుడు రాజకీయం చేఅస్తున్నారు. గత పది రోజులుగా ఆయన జనంలోనే ఉన్నారు. ఇక తాజాగా మలికిపురం సభలో జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మీద ఆయన ద్వజమెత్తారు.
అసలు ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసా అంటూ వైసీపీ ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఏపీలో ఆఫ్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ రోడ్ల మీద ప్రయాణిస్తే చాలు ప్రాణాలు పోయేలా ఉన్నాయని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ రోడ్ల మీద ప్రజలు ఎంత కాలం నడవాలి అని నిలదీశారు. రాజోలు రోడ్లపై గర్భిణులు, వృద్ధులు వెళ్తే ప్రాణాలు పోయేలా ఉన్నాయని పవన్ మండిపడ్డారు. ఇలాంటి రోడ్లను వదిలేయమేంటి అని ఆయన నిలదీశారు.
అందుకే జగన్ ప్రభుత్వానికి 15 రోజుల సమయం ఇస్తున్నా అని పవన్ స్పష్టం చేశారు. మీరు ఈలోగా రోడ్లు వేయకపోతే నేను వచ్చి శ్రమదానం చేసి రోడ్డు వేస్తాను అంటూ ప్రకటించారు. నేను వచ్చి మళ్లీ గొడవ చేశానంటే కుదరదు అని కూడా స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మీద సెటైర్లు కూడా వేశారు. కేవలం బటన్ నొక్కడం ఒక్కటే సరిపోదు కదా అని చురకలు అంటించారు. ఈ ప్రభుత్వంలో కనీసం కాల్వ గట్టులు కూడా సరిగ్గా వేయలేకపోతున్నారు అని పవన్ మలికిపురం సభలో ఆరోపించారు.
మొత్తానికి చూస్తే పవన్ శ్రమదానానికి రెడీ అంటున్నారు. పదిహేను రోజుల టైం ఇచ్చేశారు. అంటే ఒక విధంగా డెడ్ లైన్ అన్న మాట. ఈలోగా రోడ్లు వేశారో ఓకే. లేకపోతే సమరమే అని హెచ్చరించేశారు. వారాహి యాత్రలో ఇప్పటిదాకా విమర్శలతోనే సాగిన పవన్ ఈ రోజు సరికొత్త అజెండా తీసుకున్నారు.
ప్రజా సమయలను టచ్ చేయడమే కాదు ప్రభుత్వం ప్రజలజు ఎలా ఇబ్బందులు పెడుతోందో కూడా చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయలు కల్పించడంతో వైసీపీ విఫలం అయిందని అంటూ రోడ్లను ఉదహరించారు. ఇక శ్రమదానం చేస్తామని పవన్ చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశారు అని అంటున్నారు.
పవన్ కల్యాణ్ తాజా డెడ్ లైన్ తో ప్రభుత్వం రోడ్లను వెంటనే వేసినా ఆ క్రెడిట్ ఆయన ఖాతాలోనే వేసుకుంటారు. ఒకవేళ వేయకపోతే కచ్చితంగా జనం పక్షాన నిలిచి శ్రమదానంతో ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేయాలో అంతా చేస్తారు. మొత్తానికి పవన్ న్యూ స్ట్రాటజీ ఇపుడు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉందని అంటున్నారు.