Begin typing your search above and press return to search.

భీమవరం నుంచి పవన్ : గ్రౌండ్ రియాల్టీస్ ఇవేనా...?

By:  Tupaki Desk   |   3 July 2023 2:50 PM GMT
భీమవరం నుంచి పవన్ : గ్రౌండ్ రియాల్టీస్ ఇవేనా...?
X
పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. తనతో పాటు మరికొంతమందిని కూడా అసెంబ్లీలోకి వెళ్ళేలా చూడాలనుకుంటున్నారు. ఇక పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనుకుంటే భీమవరం అని మాట వినిపిస్తోంది.

భీమవారంలో పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుంది. అక్కడ అంతా నల్లేరు మీద నడకేనా అంటే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం షాకింగ్ గానే ఫీడ్ బ్యాక్ వస్తోంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో విశాఖలోని గాజువాక, భీమవరంలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.

ఈసారి ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. అలా పోటీ చేసే నియోజకవర్గాలు ఒకటా రెండా అన్నది తెలియడంలేదు కానీ భీమవరం నుంచి పవన్ పోటీ చేయవచ్చు అని ఒక చర్చ అయితే సాగుతోంది. భీమవరంలో తాజాగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన నేల భీమవరం అన్నారు. ఇక్కడే ఉంటాను అని కూడా మాట చెప్పారు.

దాన్ని బట్టి చూస్తే ఆయనే పోటీకి రెడీ అని అంటున్నారు. అయితే భీమవరంలో పవన్ పోటీ చేస్తే నిజంగా అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా. ఆయనకు భీమవరం క్యాట్ వాక్ గా ఉంటుందా అన్నది చూస్తే షాకింగ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది అంటున్నారు నిజానికి గోదావరి జిల్లాలలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అని కొన్నాళ్ళుగా విన వస్తున్న మాట. దాంతో భీమవరంలో పవన్ నామినేషన్ వేస్తే గెలిచేలా సీన్ ఉండాలి. కానీ అసలు పరిస్థితి వేరేగా ఉంది అని అంటున్నారు. అదెలా అంటే జనసేన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అన్నది పక్కన పెడితే మాత్రం గగ అయిదేళ్ళలో పవన్ ఇమేజ్ మాత్రం బాగా తగ్గింది అని అంటున్నారు.

తాజాగా వచ్చిన సర్వే నివేదికలు చూస్తే పవన్ తన నిలకడలేనితనంతోనే ఇలా చేసుకున్నారని అంటున్నారు. ఆయన అనేక పార్టీలతో పొత్తులు కట్టడం, మళ్ళీ విడిపోవడం మళ్లీ పొత్తులు అనడం ఇలా గందరగోళ రాజకీయం పైన జనాలు ఆయన పాలిటిక్స్ మీద పెద్దగా విశ్వాసం చూపించడం లేదు అని అంటున్నారు.

అదే టైం లో పవన్ కళ్యాణ్ ని ఈ రోజుకు పార్ట్ టైం పొలిటీషియన్ గానే చూస్తున్నారుట. పవన్ రాజకీయంగా జనంతో గడిపినది తక్కువ సమయమే అంటున్నారు. ఇక భీమవరంలో ఆయన ఉన్నది కూడా తక్కువే అని కూడా అంటున్నారు. ఇక పవన్ ఆవేశపూరితంగా చేసే ప్రసంగాలలో కూడా ఒక లాజిక్ కానీ ఒక తీరు కానీ కనిపించడంలేదు అని అంటున్నారు. అదే విధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళు పై దాటుతున్నా ఆయన్ని ఈ రోజుకీ విశ్వసనీయమైన నాయకుడిగా పరిగణించడంలేదు అని అంటున్నారు. దానికి ఆయన చేసుకున్నదే అంతా అని అంటున్నారు.

ఇక కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ వైపే అన్న మాట కూడా తప్పే అని సర్వే వివరాలు చెబుతున్నాయని అంటున్నారు. జనసేనకు కట్టుబడి విధేయులుగా ఉన్న కాపులు తప్ప మిగిలిన కాపులు అంతా కూడా తన అభిప్రాయాలను జనసేన వైపు గా మళ్ళించు కోవడం లేదు అంటున్నారు. కాపులే ఇలా ఉంటే మిగిలిన వారి సంగతి కూడా ఇంకా భిన్నంగా ఉంది అని అంటున్నారు.

పవన్ కి ఓటేయాలని గట్టిగా ఎవరూ భావించని పరిస్థితి ఉంది. ఇదంతా పవన్ పొలిటికల్ ఇమేజ్ ని ఆయనకు ఆయనే డ్యామేజ్ చేసుకోవడం వల్ల వచ్చిన చిక్కులు అంటున్నారు పవన్ రాజకీయ గందరగోళం ఒక వ్యూహం లేకపోవడం ఒక అజెండాతో జనాలలోకి రాకపోవడం అనేక మైనసుల్ల ఫలితంగా 2024 ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేసినా సానుకూల ఫలితాలు వస్తాయని అయితే ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి పవన్ కి ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని ఉంది. మరి ఆయన కోరిక తీరుతుందా అంటే ఆలోచించాల్సిందే అన్నట్లుగా సర్వే ఉందని అంటున్నారు.