Begin typing your search above and press return to search.
పవన్.. సర్ ఆ కామెంట్లు వెనక్కి తీసుకున్నట్టేనా?!
By: Tupaki Desk | 18 Nov 2022 1:30 AM GMTనెటిజన్లు మహా హాటు గురూ! అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వైఖరిపై ఏపీలో చర్చ నడుస్తోంది. ఆయన పొత్తుల విషయంలో ఎలాంటి వైఖరి అవలంభిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల విశాఖలో ఘటనల నేపథ్యంలో టీడీపీఅధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన పవన్.. ప్రజాస్వా మ్య పరిరక్షణకు పోరాటాలు చేస్తామన్నారు. దీని ఊసు ఇప్పటికీ లేదు. ఇక, ప్రధాని మోడీతో భేటీ తర్వాత.. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆసక్తిగా కామెంట్లు చేశారు.
తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. అయితే.. ఇక్కడే నెటిజన్లు సహా.. రాజకీయ విశ్లేషకులు సైతం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేంటంటే.. జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ అత్యంత కీలక మైన వ్యాఖ్యలు చేశారు. ``వైసీపీ వ్యతిరేక ఓటుబ్యాంకును చీలనివ్వబోనని.. అందరినీ ఒకే తాటిపైకి (అన్ని ప్రతిపక్షాలు) తెచ్చేందుకు ఏం చేయాలో అది చేస్తాను.. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నా`` అని సంచలన ప్రకటన చేశారు.
ఇది సహజంగానే.. వైసీపీ యేతర పార్టీలకు ఆనందం కలిగించింది. ఎఎందుకంటే.. ఎవరికి వారు విడిగా పోటీ చేస్తే.. వైసీపీకి మేలు జరుగుతుందనే అంచనా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ చేసిన సూచన, కామెం ట్లు కూడా.. అప్పట్లో తీవ్రమైన ప్రభావం చూపాయి.
దీంతో ఒకానొక దశలో వైసీపీ కూడా డిఫెన్స్‌లో పడిపో యింది. అన్ని పార్టీలూ కలిసి పనిచేస్తే.. తమ కు అధికారం చేజారుతుందని అంచనా వేసుకుంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఒంటరిగా పోటీ చేయాలంటూ.. అప్పట్లో మంత్రులు సవాళ్లు రువ్వారు.
ఏ వేదిక ఎక్కినా.. ఇదే పాట పాడారు. దీనికి పవన్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నేను ఎవరితో పొత్తు పేట్టుకోవాలో వైసీపీ నాకు డిక్టేట్ చేస్తుందా? అని ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా టీడీపీకి.. వామపక్షాలకు కూడా డిస్టెన్స్ మెయింటెన్ చేయడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ పడతాను! అనే సంకేతాలు ఇస్తున్నారు. మరి దీనిని బట్టి.. పవన్ ఇప్పటి వరకు చెప్పిన కామెంట్లు.. అన్నీ కూడా వెనక్కి తీసుకున్నట్టేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండడం గమనార్హం. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.