Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌-ష‌ర్మిల ఇద్ద‌రూ క‌లిసి `కేసీఆర్`కు పువ్వుల్లో పెట్టి మ‌ళ్లీ అధికారం ఇవ్వ‌బోతున్నారా?‌

By:  Tupaki Desk   |   26 April 2021 4:30 AM GMT
ప‌వ‌న్‌-ష‌ర్మిల ఇద్ద‌రూ క‌లిసి `కేసీఆర్`కు పువ్వుల్లో పెట్టి మ‌ళ్లీ అధికారం ఇవ్వ‌బోతున్నారా?‌
X
ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లోను, మేధావుల చ‌ర్చ‌ల్లోనూ ఇదే విష‌యం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇంకా పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని వైఎస్ గారాల‌ప‌ట్టి, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల ఇద్ద‌రూ క‌లిసి.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు తిరిగి పువ్వుల్లో పెట్టి అధికారం అప్ప‌గించ‌నున్నారా? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి తెలంగాణ తెచ్చింది నేను, తెలంగాణ కోసం .. అహ‌ర్నిశ‌లు కృషి చేసింది నేను, ప్రాణ‌త్యాగానికి ఒడిగ‌ట్టేందుకు రెడీఅ యింది కూడా నేనే అని చెప్పుకొనే.. కేసీఆర్‌కు తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత‌.. వ‌చ్చిన 2014లో ఎలాంటి ఫ‌లితం వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే.

ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు, ఆయ‌న పార్టీకి పెద్ద‌గా మెజారిటీ రాలేదు. కానీ, అప్ప‌ట్లో తెలంగాణ‌లో పోటీ చేసిన టీడీపీ, వైసీపీ పార్టీల త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను లాక్కుని, ఆ రెండు పార్టీల‌ను వీక్ చేయ‌డం ద్వారా తానే పెద్ద అని అనిపించుకున్నారు కేసీఆర్‌, ఇక‌, 2018 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి.. త‌న‌కు ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునేందుకు ముఖ్యంగా రైతు ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో త‌న ప్ర‌భుత్వాన్ని ర‌క్షించుకునేందుకు కేసీఆర్ వ్యూహాలు ప‌న్నుతున్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌రోక్షంగా కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చారు.

త‌గుదున‌మ్మా అంటూ.. కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి.. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. ఇంకేముంది.. కేసీఆర్ విజృం భించారు. ``రామేశ్వ‌రం పోయినా.. శ‌నేశ్వ‌రం పోలేద‌న్న‌ట్టు.. ఈ ఆంధ్రోళ్ల పెత్త‌నం ఏంటి మ‌న‌మీద‌`` అం టూ.. చంద్ర‌బాబును కార్న‌ర్‌ను చేసుకుని మ‌ళ్లీ సెంటిమెంటును ర‌గిలించి భారీ మెజారిటీతో గ‌ట్టెక్కేశారు.

అయితే.. ఈ మ‌ధ్య జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక కావొచ్చు, గ్రేటర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కావొచ్చు.. ఏదైనా ఆంధ్రా నేత‌లు కానీ, టీడీపీ నేత‌లు కానీ, ముఖ్యంగా చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు లోకేష్‌లు ఎక్క‌డా ఎంట్రీ ఇవ్వ‌లేదు.

దీంతో కేసీఆర్‌కు సెంటిమెంటు రాజ‌కీయం అందిపుచ్చుకునే అవ‌కాశం లేకుండా పోయింది. ఫ‌లితంగా బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. దీంతో టీఆర్ ఎస్ కొద్దిగా వీక్ అయింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈనేప‌థ్యంలో టీఆర్ ఎస్ మేల్కొని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బూత్ స్థాయిలో టీఆర్ ఎస్ నేత‌లు ప‌నిచేసి.. గెలిచారు. ఇక‌, ఇప్పుడు మిగిలింది.. దాదాపు 2023 ఎన్నిక‌లే. అప్పుడు టీఆర్ ఎస్ ఎలా గెల‌వాలి? ఏ విధంగ పైచేయి సాధించాలి. అధికారం ద‌క్కించుకుని ఎలా హ్యాట్రిక్ సంపాయించాలి ? అని నేత‌లు త‌మ త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెడుతున్నారు.

ఈ క్ర‌మంలోవారికి.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైఎస్ ష‌ర్మిల రూపంలో ఆయుధాలు దొరికాయ‌ని.. టీఆర్ ఎస్‌లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆంధ్ర‌పేరు మీద తెలంగాన సెంటిమెంటు ఉన్న నాయ‌కులు వాళ్ల‌కు బాగా ప‌నిచేస్తారు క‌నుక‌.. టీఆర్ ఎస్‌కు ఈ ఇద్ద‌రి వ‌ల్ల‌.. మ‌ళ్లీ అధికారంలో పూల‌లో పెట్టి అప్ప‌గించిన‌ట్టు అవుతుందని అంటున్నారు. అంటే.. ఇటు ప‌వ‌న్ ఎలాగూ.. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాను టీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తిస్తున్నాన‌ని చెప్పేశారు. సో.. ఆయ‌న త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేత‌లు టీఆర్ ఎస్‌కు ప‌నిచేసేవారు పెరిగే అవ‌కాశం ఉంది. ఇక‌, ష‌ర్మిల విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి. ఏదేమైనా.. ఈ ఇద్ద‌రి వ‌ల్ల మ‌ళ్లీ టీఆర్ ఎస్ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.