Begin typing your search above and press return to search.

పవన్, చంద్రబాబువి కాకిలెక్కలేనా ?

By:  Tupaki Desk   |   28 Feb 2021 12:30 PM GMT
పవన్,  చంద్రబాబువి కాకిలెక్కలేనా ?
X
ఇటీవలే ముసిగిన పంచాయితి ఎన్నికల్లో జనసేన 27 శాతం ఓట్లు సాధించిందన్నారు. ఇదే విధంగా ఆమధ్య చంద్రబాబునాయడు మాట్లాడుతూ పంచాయితి ఎన్నికల్లో టీడీపీ 38 శాతం సీట్లు సాధించుకుందని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు చెప్పిన లెక్కలపై పెద్ద వివాదం రేగింది. సరే వీళ్ళ లెక్కలను పక్కనపెట్టేస్తే పంచాయితీల్లో తాము 80 శాతంకు పైగా సీట్లను, ఓట్లను సాధించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లెక్కలు విడుదల చేశారు.

తమ పార్టీ తరపున పోటీచేసి గెలిచిన వారి లెక్కలను, ఫొటోలతో సహా పార్టీ వెబ్ సైట్లో పెట్టినట్లు సజ్జల స్పష్టంగా చెప్పారు. తాము చేసినట్లుగా చంద్రబాబు, పవన్ కూడా చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుందని సజ్జల చేసిన సవాలుగా ఇద్దరూ సమాధానం చెప్పలేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పంచాయితి ఎన్నికల్లో తమ పార్టీ 27 శాతం ఓట్లు సాధించిందని చెప్పటమే విచిత్రంగా ఉంది.

వైసీపీ నేతలు మాట్లాడుతూ పంచాయితిల్లో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్ధులే కరువయ్యారని చాలాసార్లు ఎద్దేవా చేశారు. దానికి జనసేన నుండి సరైన సమాధానమే రాలేదు. ఇలాంటి నేపధ్యంలో 27 శాతం ఓట్లు సాధింటచటమంటే జనాల్లో వస్తున్న మార్పుకు నాందిగా పవన్ అభివర్ణించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని సర్పంచులు, ఎన్ని వార్డులు గెలుచుకుందో పవన్ లెక్కలు చెప్పారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయితీల్లో జనసేన రెండోస్ధానంలో నిలిచిందన్నారు. అంటే టీడీపీ మూడోస్ధానంలో నిలిచినట్లే కదా లెక్క. మరి ఇదే సమయంలో టీడీపీ వేలాది పంచాయితీల్లో గెలిచిందని లేకపోతే రెండోస్ధానంలో నిలిచినట్లు చంద్రబాబు కూడా మీడియా సమావేశాల్లో చెప్పారు. మరో రెండోస్ధానం విషయంలో చంద్రబాబు, పవన్ లో ఎవరు చెప్పింది వాస్తవం. ఇక పవన్ ఎక్కడ కూడా తమ మిత్రపక్షం బీజేపీ గురించి కనీసం కూడా ప్రస్తావించకపోవటం గమనార్హం.