Begin typing your search above and press return to search.
'బండి' మాటలుమాట్లాడతావేంది పవన్? ఫైళ్లు బయట పెట్టొచ్చుగా?
By: Tupaki Desk | 15 Jun 2023 1:03 PM GMTతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి తెలిసిందే. అవసరం ఉన్నా లేకున్నాకొన్ని మాటలు మాట్లాడి ఉన్న విలువ ను పోగొట్టుకుంటుంటారు. తరచూ ఆయన.. కేసీఆర్ కుటుంబం జైలు పాలు అవుతుందని హెచ్చరిస్తుంటారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి సంబంధించి తన దగ్గర బోలెడంత సమాచారం ఉందని.. సమయం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతానని చెబుతుంటారు. నిజంగానే.. బండి దగ్గర ఆ సమాచారం ఉందా? అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. డైలీ బేసిస్ లో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యాల పై బట్టలిప్పదీసి చాకిరేవు పెట్టిన మంత్రి కేటీఆర్ తీరు ను చూసిన తర్వాత అయినా బండి తన దగ్గరున్న గులాబీ నేతల ఆరాచకాల వివరాల్ని.. ఆధారాల్ని బయట పెడతారని భావించారు. కానీ.. అలాంటిదేమీ జరిగింది లేదు. ఇదంతా చూసిన తర్వాత కానీ మాటలే తప్పించి బండి చేతల్లో ఏమీ చేయలేరన్న విషయం బోధపడింది.
బండి సంజయ్ మాదిరే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఉందని చెప్పాలి. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ బయట కు వచ్చి.. మైకు పట్టుకొని నాలుగు మాటలు మాట్లాడినంతనే వైసీపీ కి చెందిన నేతలు విరుచుకుపడటం.. సోషల్ మీడియా లో ఎటకారం చేసుకోవటం కనిపిస్తుంది. ఇంతలా మాటలు అనేస్తున్న వేళ..నిజంగానే పవన్ దగ్గర వైసీపీ నేతల కు చెందిన ఆరాచకాల వివరాలు ఉండి ఉంటే.. వాటిని బయటపెట్టటం లో తప్పేం లేదు కదా?
అందుకు భిన్నంగా ఇప్పటి వరకు వైసీపీ సర్కారు లోని ఏ నేతకు చెందిన అవినీతి మీద కానీ.. వారికి సంబంధించిన వైఫల్యాల కు సంబంధించిన అంశాల్ని ఆధారాల సహితంగా మీడియా ముందుకు వచ్చింది లేదు. అలాంటి పవన్ తాజాగా కత్తిపూడి లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. "వైసీపీ నేతల తప్పుడు పనుల పై నా దగ్గర చాలా ఫైళ్లు ఉన్నాయి. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలి కి వెళ్లను. ఒక పాలసీ విధం గానే నేను విమర్శలు చేస్తున్నా" అంటూ చెప్పే మాటల్ని చూసినప్పుడు.. కొన్ని సందేహాలు రాక మానదు.
యుద్ధం జరుగుతున్న వేళ.. విజయమే లక్ష్యంగా ప్రత్యర్థి దర్మాధర్మాల గురించి ఆలోచించకుండా పోరాడుతున్నాడని అనుకుందాం. అలాంటి వేళ.. ధర్మం గురించి చెబుతూ ఉంటే ఏం జరుగుతుంది. ఇవాల్టి రాజకీయాలు ఎంత కఠినంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ సైతం తన మీద నోటికి వచ్చినట్లుగా విరుచుకుపడే ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి.. ధర్మం ప్రకారమే పోరాడతానని చెప్పే మాటల తో లాజిక్కు ఒక పట్టాన అంతు పట్టదు.