Begin typing your search above and press return to search.
అవిర్భావ సభలో పవన్ యాక్షన్ ప్లాన్...?
By: Tupaki Desk | 13 March 2023 5:07 PM GMTఎన్నికల్లో గెలవడానికి ప్రతీ రాజకీయ పార్టీకి వ్యూహం ఉండాలి. అధికార వైసీపీ అయితే వై నాట్ 175 అంటూ తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. ఆ పార్టీకి ఉన్న సహజ వ్యతిరేకతను ఎలా తొలగించుకోవాలన్న దాని మీద ఫోకస్ పెడుతోంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద పడుతుంది కాబట్టి పనిమంతులు కాని వారిని తీసి పక్కన పెట్టాలనుకుంటోంది.
ఆ విధంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పధ్క రచన చేస్తోంది. తెలుగుదేశం అయితే అభివృద్ధిని నమ్ముకుంటోంది. దానికి ఇపుడు సంక్షేమాన్ని కూడా జోడిస్తోంది. తాము వస్తే ఏ పధకాలు ఆగిపోవని చాటి చెబుతోంది. మరో వైపు ఏపీలో మహా కూటమిని వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలని చూస్తోంది. వీలైతే అన్ని పార్టీలను అందులోకి తేవాలనుకుంటోంది.
ఇక జనసేన విషయానికి వస్తే ఏ రకమైన వ్యూహం ఆ పార్టీకి ఉంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీసులో వరస మీటింగ్స్ పెట్టారు. అలాగే జనసేన ఆవిర్భావ సభకు ప్రిపరేషన్స్ గట్టిగానే సాగుతున్నాయి. అయితే పవన్ ఈ సభ ద్వారా ఏమి చెప్పబోతున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో పవన్ మార్క్ స్ట్రాటజీ ఏంటి అన్న దాని మీద ఇప్పటికైతే సొంత పార్టీ వారికి కూడా పూర్తిగా అవగాహన లేదని అంటున్నారు.
పవన్ సొంత సామాజికవర్గం అయిన కాపులు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు. జై కాపు సేన సారధి చేగొండి హరిరామజోగయ్య అయితే వైసీపీతో పాటు టీడీపీని గట్టిగా విమర్శించాలని పవన్ని సభాముఖంగానే కోరారు. కాపు మేధావులు అయితే స్వతంత్ర వైఖరినే అనుసరించడం ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవసరం అని నొక్కి చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. ఎందువల్లనంటే పవన్ ఎంతో గౌరవించే హరిరామజోగయ్య వంటి వారు సొంత వైఖరి అని గట్టిగా చెప్పినా పవన్ మాత్రం ఆచీ తూచీ మాట్లాడారు. తాను కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించను అని ఆయన్ అంటున్నారు. అంటే కేవలం ఇరవై సీట్లు ఇస్తే పొత్తులు ఉండవని కాపుల నేతల మాటలకు పవన్ బదులు ఇచ్చారనుకోవాలంటున్నారు.
అదే టైం లో ఆ సంఖ్య ఒక నలభై దాకా వెళ్తే కచ్చితంగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అంటున్నారు. ఇక నలభై సీట్లు తెలుగుదేశం ఇస్తుందా అన్నది వేరే చర్చ. ఇక తెలుగుదేశం వరకూ చూస్త పదిహేను నుంచి మొదలెట్టి చివరికి ఇరవై మరీ డిమాండ్ పెడితే పాతికకు పొత్తులను తెగ్గొట్టాలని చూస్తున్నారని అంటున్నారు.
బొత్తిగా పాతిక సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారా అంటే అక్కడే జనసేన ఊగిసలాటలో ఉంది అంటున్నారు. ఏపీలో వైసీపీని అధికారం నుంచి దించేయాలన్నది పవన్ అభిమతంగా చెబుతున్నారు. అదే టైం లో తాను సీఎం అవుతానా లేక చంద్రబాబా అన్నది సెకండరీ టార్గెట్ అని అంటున్నారు. అయితే అధికారంలో వాటా కోరాలీ అంటే అరవై దాకా సీట్లను డిమాండ్ చేస్తే అందులో యాభై దాకా గెలుచుకుంటే అపుడు ఒక లెవెల్ లో పొత్తుల కధ్లఒ జనసేన నెగ్గినట్లు ఉంటుందని బలమైన సామాజికవర్గం నుంచి వస్తున్న వాదన.
మరో వైపు చూస్తే జనసేనలో పవన్ తరువాత స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ వైఖరి మీద కాపులు గుస్సా అవుతున్నారు అని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తులకు ఆయనే ఉత్సాహపడుతున్నారని అంటున్నారు ఆయన వల్లనే కీలకమైన కాపు నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ణి సీఎం గా ఈసారి చూడాలి అన్నదే వారి కోరిక.
అయితే పొత్తులలో భాంగా అది సాధ్యపడుతుందా అన్నది కూడా సందేహంగా ఉందిట. అందువల్ల సొంతంగా పోటీ చేసి హంగ్ అసెంబ్లీని తీసుకురాగలిగితే కర్నాటకలో కుమారస్వామి మాదిరిగా ఏ పాతిక ముప్పయి సీట్లు తెచ్చుకున్నా పవన్ సీఎం అవుతారు అని అంటున్నారు. కానీ అలా జరగాలంటే గట్టిగా ఇప్పటి నుంచే జనంలో జనసేన ఉండాలి. ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. మరి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కచ్చితంగా వచ్చే ఎన్నికల మీద యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారు అని అంటున్నారు. దాన్ని బట్టి ఏపీలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాలని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.