Begin typing your search above and press return to search.

చెప్తా..చెప్తా అన్నీ చెప్తా.. పవన్‌ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   4 April 2023 4:00 PM GMT
చెప్తా..చెప్తా అన్నీ చెప్తా.. పవన్‌ హాట్‌ కామెంట్స్‌!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 3న ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్‌ తో రెండుసార్లు పవన్‌ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీల్లో జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ బీజేపీ నేతలతో చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ ను కలవగా బీజేపీ ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని పవన్‌ వెల్లడించారు. ఏప్రిల్‌ 4న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ భేటీ కానున్నారు.

మురళీధరన్‌తో జరిగిన భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై పవన్‌ వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు కేంద్ర మంత్రులతో ఏం మాట్లాడారని ప్రశ్నించగా చెప్తా.. చెప్తా.. అన్నీ చెప్తా.. అందరినీ కలిసిన తరువాత అన్ని విషయాలను చెప్తానంటూ పవన్‌ కల్యాణ్‌... మురళీధరన్‌ నివాసం నుంచి వెళ్లిపోయారు.

కాగా కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తో భేటీ అయిన పవన్‌ పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వివరించినట్టు తెలుస్తోంది. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పనులు 72 శాతానికి పైగా పూర్తయ్యాయని ఆయన దృష్టికి తెచ్చారు. అయితే గత నాలుగేళ్లలో మాత్రం మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌.. షెకావత్‌ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.

రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్‌ బహుళార్ధక ప్రయోజనాలు అందిస్తుందని పవన్‌ చెప్పినట్టు తెలిసింది. ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బతింటోందని కేంద్ర మంంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్‌ ను సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.