Begin typing your search above and press return to search.

కామెడీ పీస్ కాదు.. యాక్షన్ చేస్తానంటున్న పాల్

By:  Tupaki Desk   |   19 April 2023 5:07 PM GMT
కామెడీ పీస్ కాదు.. యాక్షన్ చేస్తానంటున్న పాల్
X
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కి పోయి ఉన్న వేళ.. చిరునవ్వులు చిందించుకోవటానికి.. సీరియస్ గా ఉన్న సీన్ లోకి నవ్వులు పువ్వుల మాదిరి విరిసేందుకు వీలుగా ఎంట్రీ ఇస్తుంటారు కేఏ పాల్. ఆయన చెప్పిన మాటల్ని వింటున్నప్పుడు ఎంత వద్దనుకున్నా పాల్ మాటల్ని వినాలనిపిస్తుంటుంది. ఆయన మాటల్ని వింటున్నప్పుడు మనసు చెప్పే మాటల్ని పట్టించుకోకుండా చెవులు అప్పగించేసే తీరు తెలుగు వారిలోకొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. అలాంటి కేఏ పాల్ తాజాగా అనూహ్యమైన ప్రెస్ మీట్ ను పెట్టారు.

విశాఖలో ప్రెస్ మీట పెడుతున్నట్లుగా చెప్పిన కేఏ పాల్ అనూహ్యంగా తనతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను కూడా వెంట పెట్టుకొని వచ్చి ఒక్కసారి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు. తెలుగు రాజకీయాల్లో కేఏ పాల్ ను కొందరు తేడాగా మరికొందరు కామెడీ పీస్ గా వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా ఆయన తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో అందరి అంచనలకు భిన్నగా పాల్ వెంట మాజీ జేడీ లక్ష్మనారాయణ కలిసి రాటం ఆసక్తికరంగా మారింది.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్న పాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని చెప్పారు. వైసీపీ నుంచి ఇంత మంది ఎంపీలు ఉన్నా. ఎవరు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రశ్నంచటం లేదని సూటి ప్రశ్నను సంధించారు. తనకు యాక్టింగ్ రాదని యాక్షన్ మాత్రమే వచ్చన్న కేఏ పాల్ రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకుంటామన్న మాటను అదే పనిగా చెప్పుకోవటం గమనార్హం.

పాల్ అనంతరం మాట్లాడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్కరితో తాను కలిసి పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. ఇంతవరకు కామెడీ పీస్ గా వ్యాఖ్యల్ని ఎదుర్కొంటున్నకేఏ పాల్.. తాజా మీడియా భేటీ మాత్రం బ్రేకింగ్ న్యూస్ మాదిరి మార్చారని మాత్రం చెప్పక తప్పదు.