Begin typing your search above and press return to search.
పట్టిసీమకు చంద్రన్న పట్టిసీమ పేరు పెట్టాలి: బీజేపీ
By: Tupaki Desk | 2 Sep 2015 2:02 PM GMTరాముడిపై ఆంజనేయస్వామికి ఎంత భక్తి ఉంటుందో..బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణకుమార్ రాజుకు కూడా ఇప్పుడు చంద్రబాబు అంటే అంతే భక్తి ఉంది. అసెంబ్లీలో ఆయన టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకు పూర్తి సపోర్ట్ గా ఉంటూ తన మిత్రధర్మం పాటిస్తున్నారు. ప్రతిపక్ష వైకాపాను తన మాటలతో ఇరుకున పెడుతూ చంద్రబాబును వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తున్నారు. నిన్నటికి నిన్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అనే మాటకు వైకాపా నూటికి నూరుశాతం న్యాయం చేసిందంటూ ఆ పార్టీపై సెటైర్లు వేసిన ఆయన ..చంద్రబాబు ప్రభుత్వం అన్ని అంశాల్లో సమర్థవంతంగా వ్యవహరిస్తోందంటూ మెచ్చుకున్నారు.
తాజాగా బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టును రికార్టు టైంలో పూర్తి చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. చాలా తక్కువ టైంలోనే చంద్రబాబు గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసి చరిత్ర పుటల్లో కెక్కారని ఆయన కొనియాడారు. పట్టిసీమ ప్రాజెక్టును అధికారపక్షం కేవలం కమీషన్ల కోసం, ధనార్జన కోసమే తెరపైకి తెచ్చిందంటూ వైకాపా నాయకులు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఓ ఇంజనీర్ ను అని కూడా ఆయన చెప్పారు.
వైకాపా సభ్యులు అస్సలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేవలం రూ.1300 కోట్లతో ..రికార్డు టైంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన చంద్రబాబునాయుడు పేరుమీదనే చంద్రన్న పట్టిసీమ ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేయాలని ఆయన కోరారు. పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో వైకాపా చేసే విమర్శలకు అస్సలు అర్థమే లేదని ఆయన చెప్పారు. ఏదేమైనా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోను విష్ణకుమార్ రాజు టీడీపీ చంద్రబాబుకు మద్దతుగా వైకాపాపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ చంద్రబాబుకు భక్తుడిగా మారిపోయారు. ఈ రోజు ఏకంగా పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రన్న పట్టిసీమ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని చంద్రబాబు మనస్సులో మరింత స్ర్టాంగ్ స్థానం సంపాదించేసుకున్నారు.