Begin typing your search above and press return to search.

ఏపీలో షాక్ః ఏకంగా ఊరినే తాక‌ట్టు పెట్టేశారు

By:  Tupaki Desk   |   15 Dec 2017 8:02 AM GMT
ఏపీలో షాక్ః ఏకంగా ఊరినే తాక‌ట్టు పెట్టేశారు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై పేలుతున్న సెటైర్ ఇది. `అన్ని రికార్డుల‌ను డిజిట‌లైజ్ చేస్తున్నామ‌ని...వేలి కొన‌ల‌తో స‌మ‌స్త వివ‌రాల‌న్నింటినీ పొందేలా త‌మ ఆన్‌ లైన్ విధానం ఉంద‌ని బాబు స‌ర్కారు ప్ర‌చారం చేసుకుంటోంది...కానీ క్షేత్ర‌స్థాయిలో భారీ స్థాయిలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయి. ఏకంగా ఊరు మొత్తం బ్యాంక్ తాక‌ట్టులోకి వెళ్లిపోయింది ఇవి టెక్ స‌ర్కారుకు తెలియ‌డం లేదా?` అంటూ ఓ గ్రామం రైతులు ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే....ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం డిజిటలైజేషన్‌ పేరుతో రైతుల భూములకు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందని ప్రచారం చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు - బ్యాంకర్లు కలిసి రైతులను నిలువునా ముంచి భూములను తనాఖా పెట్టేశారు. కొందరి భూములైతే ఏకంగా బోగస్‌ డాక్యుమెంట్లతో అమ్మేశారు. ఇది ఎక్క‌డో కాదు..సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి - రెవెన్యూ - స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖామాత్యులు - అయిన కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో

ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోని వెల్దుర్తి మండలం - ఎన్‌.వెంకటాపురం - నార్లాపురం గ్రామపంచాయతీకి చెందిన రైతుల భూములను వారి ప్రమేయం లేకుండానే బ్యాంకు తనాఖాలోకి పోయాయి. సుభాష్‌ చంద్రబోస్‌ అనే రైతు బ్యాంకులో రుణం కోసం వెళ్లగా ఈ భాగోతం బయటపడింది. గ్రామంలో పది ఎకరాలకు పైబడి రైతుల భూములనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతు పేరు మీద దాదాపు రూ.10లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకుల్లో రుణం తీసుకొని తనాఖా పెట్టారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న పి.హనుమంతురావుకు 36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కార్పొరేషన్‌ బ్యాంకులోనే కుదువపెట్టి రూ.30 లక్షల అప్పును తీసుకున్నారు. ఇలా దాదాపు 30 మంది రైతుల భూములు బ్యాంకుల్లో తనాఖా పెట్టి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నారు. కర్నూలులోని కార్పొరేషన్‌ బ్యాంకులో తనాఖా పెట్టిన భూములన్ని డోన్‌ పట్టణంలో ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మార్టిగేజ్‌ చేసినట్లు రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా ఇసి - నకలు డాక్యుమెంటేషన్‌ కోసం డోన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా మా పొలాలకు చెందిన వివరాలివ్వకుండా ప్రింటర్‌ చెడిపోయిందని - సాప్ట్‌ వేర్‌ పని చేయడంలేదని వెనక్కి పంపేవారని, తీరా చూస్తే ఇలా త‌మ భూములు త‌మ‌వి కాకుండా పోయాయ‌ని అన్న‌దాత‌లు ఆవేద‌న చెందుతున్నారు.

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు..ఏకంగా గ్రామంలోని మెజార్టీ భూములన్నీ రైతుల ప్రమేయం లేకుండానే తనాఖాలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని గురువారం రైతులు ఈ సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు - బ్యాంకు మేనేజర్ల సహకారంతోనే ఈ భూదందా నడిచిందని - తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మధుసూదన్‌ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ `మా తండ్రి గోవిందరెడ్డి పేరు మీద భూమి ఉంది. మా తండ్రికి డబ్బై ఏళ్ల వయస్సుంటే 39 వయస్సు గల గోవిందరెడ్డి ఆధార్‌ పెట్టి మా భూమిని మదనగోపాల్‌ రెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. ఇలా మాకున్న 10.24 ఎకరాలు భూమిని అమ్మేశారు. భూమి ఇప్పుడు మా ఆధీనంలో ఉన్నా రికార్డుల్లో అమ్మినట్లుగా ఉంది.`` ఇదే అన్యాయం అంటూ మీడియాతో వాపోయాడు.