Begin typing your search above and press return to search.

ఆ డైలాగ్ పలకటంతోనే దాడిశెట్టి రాజా ప్లాప్ అయ్యారా?

By:  Tupaki Desk   |   17 Jun 2023 10:26 PM GMT
ఆ డైలాగ్ పలకటంతోనే దాడిశెట్టి రాజా ప్లాప్ అయ్యారా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పంచ్ లు వేసేందుకు మరో వైసీపీ నేత ముందుకు వచ్చారు. వారాహి విజయ యాత్ర పేరుతో జనసేనాని గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న వేళ.. ఇప్పటివరకు ఆయనపై స్పందించిన మాజీ మంత్రుల పేర్ని నాని.. కొడాలి నానిలతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అదే బాట పట్టారు మంత్రి దాడిశెట్టి రాజా. ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో పవన్ ఆ రీతిలో చెలరేగిపోతూ.. దూసుకెళ్లిపోతున్న వేళ.. మంత్రి దాడిశెట్టి రాజా గొంతు సవరించుకున్నారు.

పవన్ పై సినిమాటిక్ పంచ్ వేసేందుకు ఆయన.. పాపులర్ డైలాగ్ అయిన.. 'అలా వదిలేయకండ్రా..' అంటూ చేసిన వ్యాఖ్య రివర్సు అయ్యిందంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో రావు రమేశ్ క్యారెక్టర్ అనే ఈ డైలాగ్ హీరో మహేశ్ ను ఉద్దేశించి.. ఫస్ట్రేషన్ తో రావురమేశ్ అనే నెగిటివ్ క్యారెక్టర్ వ్యాఖ్య చేయటం తెలిసిందే.

రీల్ లోని డైలాగ్ ను వాడే వేళ.. దాని బ్యాక్ గ్రౌండ్.. ఆ డైలాగ్ వాడటం వల్ల తనకొచ్చే మైలేజీ విషయాన్ని మంత్రి దాడిశెట్టి మిస్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి దాడిశెట్టి.. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కావటం కూడా కష్టమే అంటూ విరుచుకుపడ్డారు. పవన్ సభలు వరుస పెట్టి ప్లాప్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. పవన్ వారాహి యాత్ర ఫెయిల్ అయ్యిందన్న దాడిశెట్టి.. సభలకు జనం రాకపోతే పవన్ కు యజమాని ప్యాకేజీ ఇవ్వరన్నారు. ఎమ్మెల్యే కావాలన్నా.. సీఎం అవ్వాలన్నా జనం ఓట్లు వేయాలని.. పవన్ ఎక్కడ పోటీ చేయాలో కూడా యజమాని డిసైడ్ చేయాలన్నారు.

బాబా అవతారం ఎత్తిన పవన్ ఇప్పుడు అమరావతి అన్నారని.. ఒక్కరోజైనా కుటుంబంతో పవన్ అమరావతికి వచ్చాడా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ ఇంటి శంకుస్థాపన వేళ.. భార్యతో సహా హాజరై పూజలు చేసిన పవన్ ను మర్చిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

పవన్ ను మానసిక వైద్యుడికి చూపించాలన్న దాడిశెట్టి వ్యాఖ్యలు అతికేట్లు లేవని.. కాస్తంత కసరత్తు చేసి పవన్ మీద విరుచుకుపడితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించి అభాసుపాలు అయితే..తాజాగా దాడిశెట్టి.. అలా వదిలేయకండ్రా అంటూ సినిమా డైలాగ్ చెప్పి.. అడ్డంగా బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.